రేగా నాయకత్వంలోనే ఏజెన్సీ అభివృద్ది

రేగా నాయకత్వంలోనే ఏజెన్సీ అభివృద్ది

0
TMedia (Telugu News) :

 

trs joins
trs joins

రేగా కాంతారావు సమక్షంలో పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరిక

టీ మీడియా,జనవరి 14,కరకగూడెం;

కరకగూడెం మండలానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్రశేఖర రావు ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలకు అకర్షతులై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ… ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి నిరంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులు చూసి ఆనేక మంది టిఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు.
పేద ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుందని, సీఎం కేసీఆర్ పై ప్రజలు పూర్తి నమ్మకం, భరోసా కలిగి ఉన్నారని ఆయన అన్నారు.నిత్యం ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య,ప్రధాన కార్యదర్శి బుడగం రాము,కొంపెల్లి రామలింగం,కొమరం రాంబాబు,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,సోందుపాష,చిట్టి సతీష్,యలిపెద్ది శ్రీనువాసు రెడ్డి,సారా సాంబయ్య,రావుల రవి,దాసరి సాంబయ్య,యూత్ నాయకులు లెలిన్,శ్రీనువాసు,దిలీప్,ప్రవీణ్,కిరణ్, పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube