వద్దిరాజు కృతజ్ఞత సభ ఏర్పాట్లు పరిశీలించిన తెరాస నాయకులు

వద్దిరాజు కృతజ్ఞత సభ ఏర్పాట్లు పరిశీలించిన తెరాస నాయకులు

1
TMedia (Telugu News) :

వద్దిరాజు కృతజ్ఞత సభ ఏర్పాట్లు పరిశీలించిన తెరాస నాయకులు
టి మీడియా, జూన్ 18, ఖమ్మం:తెలంగాణ రాష్ట్ర సమితి నుండి రాజ్యసభ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మొదటిసారి గా ఖమ్మం జిల్లాకు వస్తున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరియు బండి పార్థసారథి రెడ్డి లకు రేపు జిల్లా సరిహద్దు వద్ద ఘన స్వాగతం పలికి అక్కడ నుండి భారీ ర్యాలీగా ఖమ్మం చేరుకొని నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు.

 

కాగా ఈ సభ ఏర్పాట్లను శుక్రవారం నాడు సాయంత్రం ఎమ్మెల్సీ, జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, తెరాస జిల్లా నాయకులు కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రి యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య పరిశీలించారు. వారి వెంట చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube