బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ నాయకుల పరామర్శ

బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్ నాయకుల పరామర్శ

1
TMedia (Telugu News) :

బాధిత కుటుంబాలకు టిఆర్ఎస్
నాయకుల పరామర్శ
టిమీడియా మార్చి 11 జూలూరుపాడు:వైరా ఎంఎల్ఏ లావుడియా రాములు ఆదేశానుసారం శుక్రవారం జూలూరుపాడు ఎంపిపి లావుడ్యా సోని, టిఆర్ఎస్ మండలాద్యక్షులు చౌడం నరసింహారావుల నేతృత్వంలో మండలంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయాన్ని అందచేసారు.జూలూరుపాడు గ్రామానికి చెందిన మంద రాములు దశదిన కార్యక్రమం హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఇదే గ్రామానికి చెందిన చెందిన కంచెపోగు రాములు ఇటీవల మరణించడంతో ఆతన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Also Read : డిసిసిబి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పోతురాజు నాగరాజు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకొని పరామర్శించారు. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన మైపు బాబు అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వేమూరి జోగమ్మను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.అనంతారం గ్రామ పంచాయతీకి చెందిన కుంజ నాగమయ్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కన్వీనర్ యాదళ్ల పల్లి వీరభద్రం , కాకర్ల ఎం పి టి సి పొన్నెకంటి సతీష్, బొజ్య తండా సర్పంచ్ లావుడియా కిషన్ లాల్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షులు గుగులోత్ చంటి నాయక్, సీనియర్ నాయకులు రామిశెట్టి నాగేశ్వరావు, రామ్ శెట్టి రాంబాబు, మిర్యాల ఫ్రాన్సిస్, మోదుగు రామకృష్ణ, చౌడo వెంగళ్లరావు, సోషల్ మీడియా గుగులోత్ రాంబాబు మరియు నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube