కేంద్రం వడ్లు కొనాలని తెరాస నాయకులు
టీ మీడియా మర్చి 28 ముత్తారం : మండల కేంద్రం అడవిశ్రీరాంపూర్ చౌరస్తాలో జరిగిన మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు ,మాజీ ఎంపీపీ అత్తె చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం పంజాబ్ రాష్టంలో వరి ధాన్యాన్ని రెండు పంటలు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఐ ద్వారా కొనుగోలు చేస్తున్న మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నూటికి నూరు శాతం యేసంగి పంట వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని ముత్తారం మండల రైతుబంధు సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల ముత్తయ్య,జడ్పీటీసీ చెలుకల స్వర్ణలత-అశోక్, వైస్ ఎంపీపీ సుధాటి రవీందర్ రావు,సర్పంచులు నెత్తెట్ల మహేందర్,సంపత్ రావు,సింగిల్ విండో డైరెక్టర్ పాపయ్య,లక్కారం గ్రామ ఉప సర్పంచ్ జంగా తిరుపతి రెడ్డి, ఓడేడ్ గ్రామ రైతు అధ్యక్షులు పాపారావు, రైతు బంధు సభ్యులు ఆనుమ చందు,జంగ స్వామి,టిఆర్ స్ మండల ప్రధాన కార్యదర్శి పెయ్యాల కుమార్, సంజీవ్ రెడ్డి,కైలాసం,నరేష్,బాపు,తదితరులు పాల్గొన్నారు.
Also Read : పామాయిల్ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube