సీఎం కేసీఆర్ వెన్నంటే తెలంగాణ ప్రజనీకం

-టిఆర్ఎస్ నాయకులను కించపరిస్తే కార్యకర్తలు ఉరుకోరు

1
TMedia (Telugu News) :

సీఎం కేసీఆర్ వెన్నంటే తెలంగాణ ప్రజనీకం
-టిఆర్ఎస్ నాయకులను కించపరిస్తే కార్యకర్తలు ఉరుకోరు
-ఎమ్మెల్యే కోరుకంటి చందర్

టీ మీడియా,జూన్ 17,రామగుండం :దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తూ సకల వర్గాల సంక్షేమ కోసం నిత్యం శ్రమిస్తు.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్న సీఎం కేసీఆర్ వెన్నంటి తెలంగాణ ప్రజలు ఉన్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు.గురువారం రామగుండం పట్టణం లోని నలభై అయిదవ డివిజన్ విశ్వం కమ్యూనిటీ హాల్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,మండల అధ్యక్షులు అధికార ప్రతినిధులు సమన్వయ కమిటీ సభ్యులు పట్టణ అధ్యక్షులతో ఎమ్మెల్యేగారు సమావేశం నిర్వహించా ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అమరులైన తెలంగాణ అమరవీరులకు, 7 LEP లో గని ప్రమాదంలో జలసమాధి అయున సింగరేణి గని కార్మికులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Also Read : పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పైన తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం తథ్యమన్నారు. అధికారం కోసమే అవిర్భావించినవి కాంగ్రెస్ బీజేపీ పార్టీలని, అధికారం కోసమే వారి అరాటమంతా అన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానన్న మహా నీయులు సిఎం కేసీఆర్‌ గారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ పట్ల నాయకులను వ్యక్తిగత విషయాలతోపాటు కించపరిచే విధంగా పోస్టులు చేస్తున్న వారిని ప్రజలు టిఆర్ఎస్ కార్యకర్తలు చూస్తు ఉరుకోరన్నారు.

also Read : ఒంటరి మహిళాకు అమ్మపరివార్ స్వచ్చంధ సంస్థ చేయూత..
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించి అధికారం చేపట్టిందని రాబోవు ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ తెరాస పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube