సీఐపై బూతులతో రెచ్చిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ

1
TMedia (Telugu News) :

 

 

సీఐపై బూతులతో రెచ్చిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ
-లం.. కో అంటూ భూతుపురణం

-ఘాటైన సమాధానం ఇచ్చిన అధికారి

ఆడియోలు బహిర్గతం

టి మీడియా,ఎప్రియల్ 28,తాండూరు: ప్రజా సేవ చేసే ప్రజాప్రతినిధి నోటా బూతుపురాణం. పోలీస్ అధికారని కూడా చూడకుండా ఓ సీఐపై అసభ్యపదజాలంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రెచ్చిపోయారు. తాండూరు పట్టణంలో జరుగుతున్నా భావిగి భద్రేశ్వరా స్వామి జాతర ఉత్సవాలల్లో భాగంగా రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. తనకు కార్పెట్ ఎందుకు వేయలేదు రా.. అంటూ తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిని రాయలేని విధంగా బూతులు తిట్టాడు. మాటలు తక్కువ బూతులు ఎక్కువగా ఉన్న కాల్ రికార్డు ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఫోన్‌లో రికార్డు అయిన మాటలు..

రౌడీ షీటర్‌కి కార్పెట్ వేసి.. నాకు ఎందుకు వెయ్యలేదు రా.. లం….. నీ…. అంటూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బూతులతో రెచ్చిపోయాడు. దీనికి సీఐ కూడా ధీటుగా సమాధానమిచ్చారు. రౌడీ షీటర్‌కి కార్పెట్ వేస్తావా అంటే.. ఎమ్మెల్యే రౌడీ షీటర్ హ.. అని సీఐ ప్రశ్నించాడు. దీంతో కోపాద్రిక్తుడైన మహేందర్ రెడ్డి వినరాని మాటలతో విరుచుకుపడ్డారు. అంటే ఎమ్మెల్యేకు మద్దతు పలుకుతున్నావా..? ఇసుక వ్యాపారం చేస్తలేవా..? అంటూ బెదిరించాడు. నీ ఉద్యోగం పోయిన కూడా నిన్ను వెంబడిస్తా.. నీ సంగతి చూస్తా అంటూ భయపెట్టాడు.

Also Read : సంకుచిత్వం…భావ దారిద్యం..

ప్రజల చేత ఎన్నుకోబడిన రాజకీయ నాయకులే ఇలా వ్యవహరించడంపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా నిన్న మంగళవారం రోజు.. యాలల మండల ఎస్ఐను కూడా ఓ కార్యక్రమంలో మర్యాద లేకుండా ఏ.. ఎస్ఐ అంటూ మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఇలా అధికారుల పట్ల గౌరవం లేని నాయకుడు ప్రజా పాలనా ఎలా చేస్తాడంటూ.. పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. తనను అసభ్యపదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. 25 ఏళ్ళుగా తాండూరులో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై.. ఈ విషయంలో కేసు నమోదు అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube