కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీల నిరసన గళం

గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన

1
TMedia (Telugu News) :

కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీల నిరసన గళం
-ఉభయ సభలు స్తంభన
– గాంధీ విగ్రహం వద్ద ఎంపీల నిరసన
కేంద్రం దిగొచ్చేదాకా పట్టు వీడేది లేదు : నామ స్పష్టీకరణ

టి మీడియా, జూలై 22,ఢిల్లీ : : పెంచిన ధరలు, జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా నాలుగో రోజు కూడా టీఆర్ఎన్ ఎంపీలు ఢిల్లీ కేంద్రంగా విపక్షాల మద్దతుతో గర్జించారు. గత నాలుగు రోజులుగా పార్టీ ఎంపీలు పట్టువీడకుండా పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం కూడా పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు, లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలంతా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లోను, బయట గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున కేంద్ర వైఖరిపై నిరసన తెలియజేస్తూ ధర్మపోరాటం చేస్తున్నారు. శుక్రవారం కూడా ఎంపీల నిరసనలతో ఉభయ సభలు మార్మోగాయి. ఉదయం లోక్ సభ నమావేశాలు ప్రారంభం కాగానే పెంచిన ధరలు, ద్రవ్యోల్బణం , జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంతో లోక్ సభను ఉదయం 12 గంటలకు, తర్వాత తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారానికి స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

 

Also Read : వర్షంలో ను మిషన్ భగీరథ కార్మికులు దీక్ష

 

తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు ఎంపీలు చేరుకుని , విపక్షాల మద్దతులో అక్కడ నిరసన కార్యక్రమం కొనసాగించారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకొని తక్షణమే ప్రజా సమస్యలపై పార్లమెంట్ భయ సభల్లో చర్చించాలని ఈ సందర్భంగా నామ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరి విడనాడాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఆర్ఎన్ ఎంపీలంతా విపక్షాల మద్దతుతో గత నాలుగు రోజులుగా పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నా పట్టకపోవడం దారుణమని నామ పేర్కొన్నారు. ప్రజలపై భారాలు తగ్గించేంత వరకు టీఆర్ఎన్ పట్టిన పట్టు విడదని నామ స్పష్టం చేశారు. అంత వరకు ఆందోళన కొనసాగిస్తూనే ఉంటుందని నామ స్పష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube