ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు

నిత్యవసరాలపై జీఎస్టీ పెంపుపై విపక్షాల నిరసన

1
TMedia (Telugu News) :

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు

-నిత్యవసరాలపై జీఎస్టీ పెంపుపై విపక్షాల నిరసన

-మూడో రోజు పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం

టి మీడియా,జూలై20, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో నిరసన పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై విపక్షాల నిరంతర నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడింది.రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో వరుసగా మూడో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది.టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన ధరల పెంపు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటును నిరసిస్తూ.. నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు.

 

Also Read : ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా..

గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. రాజ్యసభలో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో చర్చకు కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోందని, ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారుద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube