ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు
ఎంపీ నామ నాగేశ్వరరావు
టి మీడియా,ఎప్రిల్ 29,ఖమ్మం:
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, పార్లమెంటరీ నియోజకవర్గం పరధిలోని ప్రతి గ్రామం, వార్డులు, డివిజన్లలో ఉత్సాహంగా పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నాయకులకు, కార్యకర్తలకు ఎంపీ నామ ధన్యవాదాలు తెలిపారు.
Also Read : ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతిచక్రం అవార్డులు
విజయవంతంగా ముగిసిన పార్టీ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన దిశానిర్దేశం మేరకు పార్టీని, ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ప్లీనరీ సమావేశానికి జిల్లా తరఫున హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube