ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యం:ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్23,పినపాక:

పినపాక నియోజకవర్గంలో గ్రామపంచాయితీ వార్డు మెంబర్ నుండి మెదలుకుని పార్లమెంటు సభ్యుల వరకు అంతా టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారని,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా మంగళవారం పినపాక నియోజక వర్గంలోని ప్రజాప్రతినిధులు అంతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ తాత మధు నామినేషన్ కార్యక్రమానికి ఖమ్మం తరలి వెళ్లారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన పట్ల ప్రజలంతా పూర్తిస్థాయిలో విశ్వాసంతో ఉన్నారన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పాల్గొని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అంతా విజయం సాధించడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

TRS Party wins MLC polls
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube