గ్యాస్‌ ధరల పెంపు నిరసిస్తూ టిఆర్ఎస్ ధర్నా

దిస్టి బొమ్మ దహనం

1
TMedia (Telugu News) :

గ్యాస్‌ ధరల పెంపు నిరసిస్తూ టిఆర్ఎస్ ధర్నా

-దిస్టి బొమ్మ దహనం
టి మీడియా,జులై7,ఖమ్మం:
గ్యాస్ ధరల పెంపునిరసిస్తూ తెరాస ఖమ్మం నగర కమిటి అధ్వర్యంలో తెరాస శ్రేణులు, నాయకురాలు ఖమ్మం నగరంలో నిరసన చేపట్టారు.
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఖమ్మం క్యాంపు కార్యాలయం నుండి ఇల్లందు సర్కిల్ వరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

మహిళలు మోడి దిష్టి బొమ్మను ఊరేగిస్తూ, ఖాళీ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు. మోడీ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇల్లందు సర్కిల్ నందు మోడి దిష్టి బొమ్మను దహనం చేశారు.

 

Also Read : మానసిక దివ్యంగుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లడుతూ…

ప్రభుత్వం ప్రజలపై ఆర్ధిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 మేర ఇష్టం వచ్చినట్లు పెంచుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే అనేక నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని, కనీసం బ్రతకడానికే భారంగా మారిన తరుణంలో మళ్లీ ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం సిగ్గు చేటన్నారు.

పేదలపై పెంచిన ధరలతో ప్రజలు గ్యాస్ సిలిండర్ ను వీడి కట్టెల పొయ్యిని ఎంచుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

 

Also Read : బెంగాల్ హడలగొడుతున్న నైరోబీ ఈగ

పెంచిన గ్యాస్ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. బీజేపీ పాలనలో పెట్రోలు, డీజీల్‌ ధరలు పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ద్వజమెత్తారు.

పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మోడీకి ప్రజలే బుద్ధి చెబుతారని, ఆ సమయం దగ్గరలోనే ఉందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube