మార్గ‌రేట్ అల్వాకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు

మార్గ‌రేట్ అల్వాకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు

0
TMedia (Telugu News) :

మార్గ‌రేట్ అల్వాకు టీఆర్ఎస్ మ‌ద్ద‌తు..

టీ మీడియా,ఆగస్టు 5, న్యూఢిల్లీ: విప‌క్షాల ఉపరాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా మార్గ‌రేట్ అల్వా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అల్వాకు తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌క‌టించింది. మార్గ‌రేట్ అల్వాకు మద్దతునివ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

 

Also Read : క్రేన్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ఆర్టీసీ మినీ బస్సు

ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube