బస్సును ఢీకొట్టని ట్రక్కు.. ఏడుగురు దుర్మరణం
టీ మీడియా, మార్చి 4, అంబాలా : హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం ఉదయం అంబాలా వద్ద మయునా నగర్-పంచకుల జాతీయరహదారిపై ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.