తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం నడుస్తోందని …తెలంగాణ రైతాంగం కష్టాల్లో తొలగించి రాజులుగా మారుస్తున్న రైతుభాందవుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. మంగళవారం అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలు రైతుబంధు సంబరాలు వారోత్సవాల్లో భాగంగా అధికారులు రైతులు ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేగారు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు… సమైక్య పాలనలో రైతు ఆత్మహత్యల ఉండేవని… తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసి రైతుల కష్టాలు శ్వాశతంగా తోలగించిన ఘనత సిఎందన్నారు. రైతాంగానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు సకాలంలో ఎరువులు రైతుబంధు రైతుబీమా లాంటి పధకాలను ప్రవేశపెట్టి తెలంగాణ వ్యవసాయాన్ని పండగల మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు. రైతు బందు పధకం ద్వారా తెలంగాణ రైతుల ఖాతల్లో 50 వేల కోట్ల రుాపాయలు జామా కానున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాపంగా సంబురాలు వారోత్సవాలు జరుపడం జరుగుతుందన్నారు.
ALSO READ: ర్యాలీ నిర్వహించిన కమలనాథులు మూడవ తేది నుండి 10 వ తేది వరకు సంబురాలు జరుగుతాయని విద్యార్దులకు తెలంగాణ వ్యవసాయం పట్ల వ్యాసరచన పోటీలు చిత్రలేఖనం పోటీలు గ్రామాల్లో రైతు బంధు పథకంపై ముగ్గులు 10 వ తేదిన ప్రతి గ్రామ పరిధిలో ట్రాక్టర్ల ర్యాలీలు ఎండ్ల బండ్ల ర్యాలీ కేసీఆర్ గారి చిత్రపటాలకు పాలాభీషేకాలు చేపట్టాలన్నారు. రామగుండం నియోజకవర్గానికి 13 వేల 518 మంది రైతులకు ఖాతాల్లో 91 కోట్ల 66 లక్షల రుాపాయలు రైతు బంధు డబ్బులు జామ కావడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసత్యఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ బిజెపి నాయకులకు తిప్పికొట్టాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ దుర్గం విజయ జిడ్పిటీసీ అముల నారాయణ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్రెడ్డి ఎంపీటీసీలు కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి మస్కం శ్రీనివాస్ సర్పంచులు ధర్మాజీ కృష్ణ బండారి ప్రవీన్ బాదరవేని స్వామి దేవమ్మ రాములు కుర్ర వేంకటమ్మ నూకరాజు రవీందర్ గౌస్ పాషా అధికారులు మాదగిరి రాంబాబు నాయకులు ఎదులపూరం వేంకటేష్ మల్లయ్య సాగర్ కోల సంతోష్ తిరుపతి నాయక్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube