తెలంగాణ స్టేట్ లారీ అసోసియేషన్ లో

నలుగురు జిల్లావాసులకు చోటు

1
TMedia (Telugu News) :

తెలంగాణ స్టేట్ లారీ అసోసియేషన్ లో
నలుగురు జిల్లావాసులకు చోటు
టి మీడియా,మే 28, హైదరాబాద్:రాష్ట్ర లారీ అసోసియేషన్ లో జిల్లావాసులు నలుగురికి చోటు దక్కింది. ఖమ్మం లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోయపాటి శ్రీనివాసు, ఇల్లెందు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలమద్ధి రవి, బోజెల్ల పూర్ణచందర్, ఉడుతాని భాస్కర్ లు కార్యవర్గంలో చోటు సంపాదించుకున్నారు. తొలిసారిగా ఏర్పాటైన రాష్ర్ట కమిటీలో జిల్లావాసులు నలుగురికి ప్రాధాన్యం దక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : ప్రారంభమైన టీడీపీ మహానాడు

ఈ సందర్భంగా బోయపాటి శ్రీనివాసు మాట్లాడుతూ లారీ అసోసియేషన్ సభ్యులకు ఎదురయ్యే సమస్యలను తప్పకుండా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, అందరికి అండగా నిలిచి సహకరిస్తామని తెలిపారు. తమను ఎన్నుకున్న రాష్ట్ర నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికైన నలుగురిని ఈ సందర్భంగా రాష్ర్ట కార్యవర్గం ఘనంగా సన్మానించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube