టీఎస్ పీఎస్సీ ముమ్మర కసరత్తు

టీ మీడియా,మార్చి10,హైదరాబాద్

1
TMedia (Telugu News) :

టీఎస్ పీఎస్సీ ముమ్మర కసరత్తు*
-30 రోజులపాటు దరఖాస్తుల స్వీకరణ

టీ మీడియా,మార్చి10,హైదరాబాద్:
ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో అభ్యర్థులు సన్నద్ధమ య్యేందుకు తగిన సమయం ఇవ్వాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 30 నుంచి 90 రోజుల గడు వు ఇస్తామని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆర్ నుంచి పోస్టుల భర్తీ ప్రకటన వచ్చిన నేప థ్యంలో టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు ముమ్మ రం చేశారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ను జారీచేస్తామని అధికారులు చెప్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి దర ఖాస్తుల స్వీకరణకు 30 రోజుల గడువు ఇస్తామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇండెంట్ అంద గానే ఆయాశాఖ అధికారులతో, టీఎస్ పీఎస్సీ అధికా రులు సంయుక్త సమవేశాన్ని నిర్వహించి, పలు అంశాలపై కూ లంకశంగా చర్చించి అంతా సవ్యంగా ఉందో లేదో పరిశీలిస్తారు.

Also Read : రజత్ కుమార్ పై చర్యలు తీసుకోండి

పరిశీలించే అంశాలివే..*

ముందుగా ఒక చెక్‌లిస్ట్‌ను ఇచ్చి ఆయా చెక్‌లిస్ట్‌ ప్రకారం ఉన్నయో లేదో తేల్చుతారు.*

రిజర్వేషన్‌ రోస్టర్‌ విధానాన్ని పరిశీలిస్తారు.*

సర్వీస్‌రూల్స్‌, లోకల్‌, జోనల్‌, మల్టీ జోనల్‌ పో స్టులుగా విభజన సవ్యంగా ఉందో లేదో చూస్తారు.*

లోకల్‌, నాన్‌ లోకల్‌, మాజీ సైనికుల కోటా వర్తిం పు అంశాలను పరిగణనలోకి తీసుకొంటారు.*

వివిధ క్యాటగిరీలవారీగా వయో పరిమితి సడలింపుల వర్తింపును సరిచూస్తారు.*
పోస్టులవారీగా అర్హతలేమిటి, తత్సంబంధ అర్హతల, ప్రత్యేక అర్హతలను పరిగణనలోకి తీసుకోవడం, ఇటీవలే చేసిన మార్పులను పరిశీలిస్తారు.*

స్కీమ్స్‌ ఆఫ్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూలు విధివిధానాలు. పరీక్షలు అబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటాయా. లేక వ్యాసరూపంలో ఉంటాయా అన్నది సరిచూస్తారు.*

పరీక్షల సిలబస్‌, పాఠ్యాంశాలను పరిగణనలోకి తీసుకొని, నోటిఫికేషన్లను జారీచేస్తారు.*

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube