టీటీడీ ఈవో కుమారుడికి గుండెపోటు..

-వచ్చే నెలలో వివాహం

1
TMedia (Telugu News) :

టీటీడీ ఈవో కుమారుడికి గుండెపోటు..

-వచ్చే నెలలో వివాహం

లహరి, డిసెంబర్19,ప్రతినిధి : గుండెపోటుకు గురయ్యారు. తన పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన ఆయనకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. వెంటనే చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఇటీవలే చంద్రమౌళికి టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.. జనవరిలో పెళ్లి. నేడు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్న కావేరి ఆస్పత్రి డాక్టర్లు.టీటీడీఈవోధర్మారెడ్డికుమారుడుచంద్రమౌళి(శివ(28)గుండెపోటుకుగురయ్యారు.ఆయన్నుహుటాహుటినచెన్నైలోనికావేరిఆస్పత్రికితరలించగా.క్కడ చికిత్స పొందుతున్నారు. చంద్రమౌళికి ఇటీవలే టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది.

Also Read : జుట్టు రాలుతోందా? ఇలా చేశారంటే మీ కురులు పదిలమే

జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. చంద్రమౌళి ముంబైల్‌లో ఉద్యోగం చేస్తున్నారని, సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో రెండు కుటుంబాలవారు పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. అయితే కొద్దిసేపటికే గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో.. పక్కనే ఉన్న స్నేహితుడు వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలియడంతో వెంటనే శేఖర్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు.ధర్మారెడ్డి దంపతులు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కావేరి ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ విషయం తెలియడంతో టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిలు చెన్నై కావేరి ఆస్పత్రికి వెళ్లారు. వివాహ ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వెళ్తుండగా చంద్రమౌళికి గుండెనొప్పి వచ్చిందని.. వెంటనే కావేరి ఆస్పత్రిలో చేర్పించామని ధర్మారెడ్డి కుటుంబ సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం చంద్రమౌళి చికిత్స పొందుతున్నారని.. మెల్లగా కోలుకుంటున్నారని తెలిపారు. చంద్ర‌మౌళి ఆరోగ్య పరిస్థితిపై ఇవాళ ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube