అందుబాటులోకి టీటీడీ న్యూ యాప్ సేవలు
లహరి, జనవరి 27,తిరుమల : కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… ప్రపంచంలో ఉన్న భక్తులందరికీ అందుబాటులోకి టీటీడీ యాప్ అందులోకి వచ్చేసింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన టిటిడి మొబైల్ యాప్ ను ఈరోజు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డిలు ప్రారంభించారు. టీటీడీ సేవలు, మొత్తం సమాచారం అంతా ఒకే చోట ఉండే విధంగా జియో సహకారంతో ఈ కొత్త యాప్ ను రుపొంచినట్లు తెలిపారు.
సుబ్బారెడ్డి. జియో సంస్థ సహకారంతో రూ.20 కోట్ల వ్యయంతో యాప్ రూపొందించామని .. ఈ యాప్ రూపొందించేందుకు అయ్యే వ్యయాన్ని జియో సంస్థ ఉచితంగా అందించిందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ యాప్ ద్వారా వర్చువల్ సేవలను భక్తులు వీక్షించవచ్చని సూచించారు. తిరుమల శ్రీవారికి విరాళాలు కూడా అందజేయవచ్చని చైర్మెన్ సుబ్బారెడ్డి చెప్పారు.ఈ యాప్ ను ఉపయోగించి భక్తులు ఇక నుంచి శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్ చేసుకోవచ్చు.
Also Read : కృష్ణమ్మ నీటి మట్టం తగ్గుముఖం
అదే విధంగా తిరుమలకుసంబంధించిసమాచారమంతా తెలుసుకోవచ్చు. గతంలో టీటీడీకి ఉన్న గోవింద యాప్ లో ఉన్న సమస్యలు ఎదురవడంతో.. దీని ప్లేస్ లో ఈ సరికొత్త యాప్ ని టీటీడీ తీసుకొచ్చింది. ఈ కొత్త యాప్ ని ఉపయోగించి చాలా ఈజీగా స్వామివారి దర్శనం, గదులు, సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. అంతేకాదు.. స్వామివారి సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినవచ్చునని పేర్కొన్నారు సుబ్బారెడ్డి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube