టీటీడీ తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
టీ మీడియా, అక్టోబర్ 12, తిరుమల : దశాబ్దాల కాలంగా తిరుపతిలో టీటీడీకి సంబంధించిన విద్యాసంస్థలు, హాస్పిటల్స్ ఇంకా ఎన్నో సంస్థలు ఏర్పడి టీటీడీ నిధులతోనే నేటికీ కొనసాగుతున్నాయని అలాంటిది నిత్యం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సేవ కై తిరుపతి నగరం నిత్యం ఎదురుచూస్తున్నదని అలాంటి తిరుపతికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను ఒక్క శాతం వెచ్చించడం ధర్మమని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్లు వెంకటేశం, వెంకటరమణారెడ్డి లు విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్క్లబ్లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ ఈనెల తొమ్మిదవ తేదీ టీటీడీ పాలకమండలి సమావేశంలో ఒక శాతం తితిదే నిధులు తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు వీరు హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఎంతోకాలంగా దశలవారీగా ఇస్తున్న ఇంటి స్థలాలు ఫ్రీగా ఇవ్వడం లేదని తమ వేతనాలలో నెల నెల కట్ చేసుకోవడం ద్వారానే తమకు ఇంటి ప్లాట్లు వచ్చాయని ఆనాటి గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే తాము ఇంటి స్థలాలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
Also Read : కారును పోలిన గుర్తులను తొలగించాలి
ఉచితంగా తమకు టీటీడీ ఏమి ఇవ్వదని తెలియజేశారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తిరుపతి అభివృద్ధి కోసం. ఒక్కసాతం నిధుల కేటాయింపును ప్రతి ఒక్కరూ. ఆహ్వానిస్తూ తిరుపతి అభివృద్ధికి తోడ్పడాలని వీరు కోరారు. ఈ. విలేకరుల సమావేశంలో టిటిడి ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ప్రసాదరావు, భాస్కర్, ఇందిరా కల్పన, రత్న ప్రభాకర్, ఆదిలక్ష్మి , రామచంద్ర , రవికుమార్ , పద్మనాభం మునికృష్ణ , గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube