తుర్కియే భూకంపంలో 84 వేల బిల్డింగ్‌లు ధ్వంసం

తుర్కియే భూకంపంలో 84 వేల బిల్డింగ్‌లు ధ్వంసం

0
TMedia (Telugu News) :

తుర్కియే భూకంపంలో 84 వేల బిల్డింగ్‌లు ధ్వంసం

టీ మీడియా, ఫిబ్రవరి 18, తుర్కియే : తుర్కియే లో వ‌చ్చిన భూకంపం పెను విల‌యం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి ఆరో తేదీన వ‌చ్చిన భూకంపం వ‌ల్ల దేశంలో సుమారు 84,726 బిల్డింగ్‌ లు ధ్వంసం అయిన‌ట్లు ఆ దేశ ప‌ర్యావ‌ర‌ణ‌, ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక మంత్రి మూర‌త్ కురుమ్ తెలిపారు. తుర్కియేలోని ప‌ది ప్రావిన్సుల్లో ఈ న‌ష్టం జ‌రిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అదానాలో డిజాస్ట‌ర్ రెస్పాన్స్ టీమ్‌తో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. భూకంపం వ‌ల్ల చాలా వ‌ర‌కు బిల్డింగ్‌లు దెబ్బ‌తిన్నాయ‌ని, సుమారు 6 ల‌క్ష‌ల 84 వేల బిల్డింగ్‌ల‌ను త‌మ శాఖ ప‌రిశీలించింద‌ని మంత్రి మూర‌త్ తెలిపారు. అయితే దాంట్లో 84 వేల బిల్డింగ్‌లు ధ్వంస‌మైన‌ట్లు గుర్తించింద‌న్నారు. వీటిల్లో కొన్ని పూర్తిగా కూలిపోయాయి. మ‌రికొన్ని భారీగా డ్యామేజ్ అయ్యాయి. లేదంటే కొన్ని బిల్డింగ్‌ల‌ను కూల్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Also Read : భారత్‌ చేరుకున్న 12 చీతాలు..

బాగా డ్యామేజ్ అయిన బిల్డింగ్‌ల‌కు ప్ర‌జ‌లు దూరంగా ఉండాల‌ని మంత్రి సూచించారు. మార్చిలో కొత్త బిల్డింగ్ నిర్మాణాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు రీసెప్ త‌య్యిప్ ఎర్డ‌గోన్ తెలిపారు. ఏడాదిలోగా ఆ నిర్మాణాల‌ను పూర్తి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. భూకంపం వ‌ల్ల కేవ‌లం తుర్కియేలోనే సుమారు 41 వేల మంది మ‌ర‌ణించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube