మీ ఇంట్లో తాబేలు బొమ్మను ఈ దిక్కున పెడితే..

మీ ఇంట్లో తాబేలు బొమ్మను ఈ దిక్కున పెడితే..

0
TMedia (Telugu News) :

  మీ ఇంట్లో తాబేలు బొమ్మను ఈ దిక్కున పెడితే..

 

లహరి, ఏప్రిల్ 17, ఆస్టోలాజీ : ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్, దాన్ని డిజైన్ చేసే సమయంలో కొన్ని నిర్థుష్టమైన రంగుల ప్యాలెట్, డెకార్ థీమ్ వంటి వాటిని నిర్ణయించుకునేందుకు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఇంట్లో నివసించే వారి మీద ఇంట్లోని ప్రతి భాగం కూడా ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం అనేది ఒక సంప్రదాయ ఆర్కిటెక్చర్ సిస్టమ్. ఎంతో మంది పండితులు దీని గురించి చాలా పరిశోధించి అందించిన పరిజ్ఞానం. అందుకే ఇంటి నిర్మాణం చేపట్టే ముందు వాస్తును పరిశీలించి అందుకు తగినట్లు నిర్మాణాలు చేసుకోవడం అన్నిటా మంచిది.

తాబేలు బొమ్మతో దోషాల పరిష్కారం :
విష్ణు అవతారాల్లో ఒకటి కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. ఈ తాబేలు బొమ్మను చాలా మంది ఇంట్లో అలంకరించుకుంటారు. కానీ దీని ప్రభావం చాలా గొప్పది. సరైన తాబేలు బొమ్మ సరైన దిశలో పెట్టినపుడు మంచి ఫలితాలు ఉంటాయి. రకరకాల మెటల్స్ తో, చెక్కతో, గాజుతో చేసిన తాబేలు బొమ్మలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఒక్కోరకమైన తాబేలును ఒక్కోదిశలో అలంకరించాలి. ఒక్కో రకమైన తాబేలు బొమ్మతో ఒక్కోరకమైన ఫలితం ఉంటుంది. అసలు తాబేలు బొమ్మ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది? ఇంట్లో ధనం నిలిచి ఉంటుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

విష్ణుమూర్తి ఎటు వెళ్లినా ఆయన్ని అనుసరిస్తూ అతడి భార్య లక్ష్మీ దేవి వస్తుంది. సంపదల రాణి లక్ష్మిని ఆకర్శించేందుకు విష్ణువు ఆహ్వానించాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు తాబేలు దీర్ఘాయుష్షుకు ప్రతీక. తాబేలు 125 నుంచి 150 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఇది ఇంటిలోకి ఆరోగ్యాన్ని దీర్ఘాయువును తెస్తుంది.
తాబేలు బొమ్మను సరైన దిశలో పెట్టుకుంటే ఇంట్లో స్థిరత్వం, ఇంట్లో నివసించేవారికి ఆరోగ్యం, దీర్ఘాయువు, సంపద చేరి తద్వారా ఆనందం వెల్లివిరుస్తుందని పండితులు చెబుతున్నారు.

AlsoRead:వాహనాల కొనుగోలులో అవకతవకలపై విచారణ కోరుతూ నిరహార దీక్ష

 

 

 

మెటల్/వెండి: వెండితో చేసిన తాబెలు బొమ్మను వాయవ్యం లేదా ఉత్తరంలో పెట్టుకోవాలి.
ఇత్తడి: ఇత్తడితో చేసిన తాబేలును నైరుతిలో పెట్టుకుంటే ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.
చెక్క: చెక్కతో చేసిన తాబేలును తూర్పున పెట్టుకుంటే మానసిక ఆరోగ్యం, అదృష్టాన్ని ఇస్తుంది.
క్వార్ట్స్ లేదా క్లియర్ గ్లాస్: వీటితో చేసిన తాబేలును ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది.

– ఉత్తరాభి ముఖంగా ఉన్న ఇంట్లో పశ్చిమ దిక్కున తాబెలు బొమ్మ పెట్టుకుంటే అది కోరికలు నెరవేరేందుకు దోహదం చేస్తుంది. ఆఫీస్ లేదా వర్క ప్లేస్ లో పెట్టుకుంటే అధిక రాబడి, వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది.
– అభివృద్ధి నిలిచిపోయిన వారు నైరుతిలో ఇత్తడి తాబేలును ఉత్తరాభిముఖంగా ఉంచాలి. ఇది ఆర్థిక వృద్ధికి మంచిది. రకరకాల సైజుల్లో కొన్ని తాబేలు బొమ్మలను నైరుతిలో పెట్టుకున్నపుడు కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య సామరస్యం ఉంటుంది. ఇత్తడి తాబేలును పిల్లల స్టడీ టేబుల్ మీద పడమర వైపు ఉంచితే చదువులో వారికి ఏకాగ్రత పెరుగుతుంది.
– ఉత్తరాభిముఖంగా ఉండే తాబేలు బొమ్మ ఇంటి మధ్యలో ఉంచితే సహనం, పట్టుదల పెరుగుతాయి.
– అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు వెండి తాబేలును వెండి గిన్నెలో నీళ్లలో ఉంచితే అవకాశాలు మాత్రమే కాదు డబ్బు కూడా సమృద్ధిగా చేరుతుంది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube