తొలిసారిగా ఓటేసిన అవిభక్త కవలలు

తొలిసారిగా ఓటేసిన అవిభక్త కవల

1
TMedia (Telugu News) :

తొలిసారిగా ఓటేసిన అవిభక్త కవలలు

టీ మీడియా, ఫిబ్రవరి 20,అమృత్‌సర్‌: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటింగ్‌లో అవిభక్త కవలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవిభక్త కవలలైన సోహ్నా సింగ్‌, మోహ్నా సింగ్‌.. అమృత్‌సర్‌లోని మనావాలాలో తొలిసారిగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒకే శరీరాన్ని పంచుకుంటున్న ఈ సోదరులకు ఎన్నికల కమిషన్‌ వేర్వేరుగా ఓటుహక్కు కల్పించింది.

ఇది కూడా చదవండి:లెర్నింగ్ లైసెన్స్ ఆన్లైన్లో!
2002 జూన్‌ 13న జన్మిన ఈ కవలలు 2020లో 18 ఏండ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌ వారికి వేర్వేరుగా ఎపిక్‌ కార్డును అందించింది. ఈ నేపథ్యంలో తొలిసారగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు నమోదేచేసుకున్నారు. ఒక శరీరాన్ని పంచుకుంటున్నప్పటికీ వేర్వేరుగా ఓటు వేయడం పట్ల సోదరులు ఆనందం వ్యక్తంచేశారు.పంజాబ్‌లో సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరుగనుంది. మొత్తం 117 స్థానా‌లకు ఒకే దశలో పోలింగ్‌ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 మంది అభ్యర్థులు నిలిచారు. ఇందులో 93 మంది మహి‌ళలు ఉన్నారు. 2.14 కోట్ల మంది ఓటువేయనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడుతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube