ట్విట్టర్ బ్లూ టిక్‌ కోల్పోయిన ప్రముఖులు

ట్విట్టర్ బ్లూ టిక్‌ కోల్పోయిన ప్రముఖులు

0
TMedia (Telugu News) :

      ట్విట్టర్ బ్లూ టిక్‌ కోల్పోయిన ప్రముఖులు

 

టీ మీడియా, ఏప్రిల్ 21, హైదరాబాద్: ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ యజమాని ఎలాన్‌ మస్క్‌ అనుకున్నంత పని చేశారు. ట్విట్టర్ లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’కు ఛార్జీలు తీసుకొచ్చిన మస్క్‌.. డబ్బులు చెల్లించని వారికి ఆ వెరిఫికేషన్‌ మార్క్‌ను తొలగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డబ్బులు చెల్లించని సెలబ్రిటీలు కూడా తమ ఖాతాలకు బ్లూ టిక్ కోల్పోవాల్సి వచ్చింది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల ఖాతాలకు ట్విట్టర్ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌లను తొలగించింది. ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే వెరిఫైడ్‌ బ్లూ చెక్‌మార్క్‌లను కొనసాగించనుంది.
భారత్‌లో బ్లూ టిక్‌ కోల్పోయిన ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, దిల్లీ, పంజాబ్‌, యూపీ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, యోగి ఆదిత్యనాథ్‌, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు రాజకీయ నాయకుల ఖాతాలకు ఇప్పుడు వెరిఫైడ్‌ మార్క్‌ కన్పించట్లేదు. ఇక, భాజపా, కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలకు కూడా బ్లూ టిక్‌ తొలగించారు. సినీ ప్రముఖులు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, ఆలియాభట్‌, క్రీడా రంగంలో సచిన్‌ తెందూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తదితరుల ఖాతాలకూ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ తొలగించారు.

AlsoRead:శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ భారీగా సక్సెస్

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube