హోటల్ గదులను తలపిస్తున్న ట్విట్టర్ హెడ్ ఆఫీస్
టీ మీడియా, డిసెంబర్ 9, శాన్ఫ్రాన్సిస్కో : కొత్త వర్క్ కల్చర్‌కు తెరలేపిన ట్విట్టర్ నూతన బాస్ ఎలాన్ మస్క్.. సంస్థ కార్యాలయాలను చిన్నపాటి హోటల్ గదుల్లా మార్చేశారు. ఇందులో భాగంగా అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ హెడ్ ఆఫీస్‌లోని పలు గదులు బెడ్రూమ్లను తలపించేలా ఉన్నాయి. ఆఫీసుల్లోని గదుల్లో బెడ్స్, కర్టెన్స్, కాన్ఫరెన్స్ రూమ్, టెలిప్రెజెన్స్ మానిటర్లు ఉన్నాయి. అందులోనే ఒక చెక్క టేబుల్, సోఫా, క్వీన్ బెడ్, టేబుల్ ల్యాంప్, వాషింగ్ మెషీన్, రెండు ఆఫీస్ ఆర్మ్ చైర్లు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ గదులు ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపిస్తుండటం గమనార్హం. ఒకేసారి ఎక్కువమంది విశ్రాంతి తీసుకునేవిధంగా గదులను మార్చినట్లు తెలుస్తోంది.
Also Read : వైఎస్ షర్మిల ముమ్మాటికీ బీజేపీ వదిలిన బాణమే
గత నెలలో ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులకు అల్టిమేటం జారీచేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలని లేనిపక్షంలో సంస్థను వదిలివెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే లేట్‌నైట్ వర్క్ చేసేవారి కోసం విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా కార్యాలయాలను ఇలా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube