సైబ‌రాబాద్ ప‌రిధిలో ఇద్ద‌రు సిఐలు సస్పెండ్

సైబ‌రాబాద్ ప‌రిధిలో ఇద్ద‌రు సిఐలు సస్పెండ్

0
TMedia (Telugu News) :

సైబ‌రాబాద్ ప‌రిధిలో ఇద్ద‌రు సిఐలు సస్పెండ్

టీ మీడియా, డిసెంబర్ 28, హైద‌రాబాద్ : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సీఐలను సస్పెండ్ చేశారు. సీపీ అవినాశ్ మహంతి. కేపీ హెచ్ బీ సీఐ వెంకట్, ఎయిర్ పోర్ట్ సీఐ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య వివాదంలో జోక్యం చేసుకుని ఓ వ్యక్తిని చితకబాదిన కేసులో సీఐ వెంకట్ ను , ఓ కేసులో సరిగా విచారణ చేయనందుకు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. కొన్ని రోజుల క్రితం నిజాంపేట్ రోడ్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉండే ప్రణీత్ అనే యువకుడిని కేపీహెచ్ బీ పోలీసులు ఓ కేసు ఎంక్వైరీ కోసం విచారణకు పిలిచారు. అయితే పోలీస్ స్టేషన్ లో తనను తీవ్రంగా కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు ఆరోపించాడు.

Also Read : విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి

తీవ్ర గాయాలైన ప్రణీత్ ముందుగా కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మెరుగైన ట్రీట్ మెంట్ కోసం కొన్నిరోజుల తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. ఆరోప‌ణ‌లలో నిజం తేల‌డంతో కెపిహెచ్ బి సిఐను సస్పెండ్ చేశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube