ఢిల్లీ కేబినెట్‌లోకి ఇద్దరు కొత్త మంత్రులు : ప్రకటించిన ఆప్‌

ఢిల్లీ కేబినెట్‌లోకి ఇద్దరు కొత్త మంత్రులు : ప్రకటించిన ఆప్‌

0
TMedia (Telugu News) :

ఢిల్లీ కేబినెట్‌లోకి ఇద్దరు కొత్త మంత్రులు : ప్రకటించిన ఆప్‌

టీ మీడియా, మార్చి1, ఢిల్లీ : అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్‌ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్వీకరించి, వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేసేందుకు తన కేబినెట్‌లోకి సీఎం కేజ్రీవాల్‌ ఇద్దరు కొత్తవారిని తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సౌరభ్‌ భరద్వాజ, అతిషీ ఢిల్లీ కేబినెట్‌లో మంత్రి పదువులు చేపడతారని ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ‌.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య సదుపాయాలు, పాలనా ఎజెండా అమలులో ఆ ఇద్దరు మంత్రులు కీలకంగా వ్యవహరించారు. ఇద్దరూ కేజ్రీవాల్‌ కు విశ్వసనీయ నేతలు. అవినీతి ఆరోపణలతో ఇద్దరు నేతలు కేజ్రీవాల్‌కు దూరమయ్యారు. ఉపముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనీష్‌ సిసోడియా 18 శాఖల బాధ్యతలను చూసుకునేవారు. సత్యేంద్ర జైన్‌ ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.

Also Read : పరగడుపునే నిమ్మరసం తాగితే ఏమవుతుందో తెలుసా..?

ఆయన గత కొన్ని నెలలుగా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కేజ్రీవాల్ కేబినెట్‌లో ఉండటం ఏంటి అంటూ బీజేపీ విమర్శల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను స్వీకరించిన ఎల్‌జీ.. వాటిని రాష్ట్రపతికి పంపారు. తాజా పరిణామాలతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు కేజ్రీవాల్‌ తన కేబినెట్‌లోకి ఇద్దరు కొత్త మంత్రులను తీసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube