*టూ వీలర్స్ వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్ను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి* 

టీ మీడియా,మార్చి 5

1
TMedia (Telugu News) :

*టూ వీలర్స్ వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్ను ఆవిష్కరించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి*

 

టీ మీడియా,మార్చి 5 , ఖమ్మం: శనివారం ఖమ్మం జిల్లా టూ వీలర్స్ వెల్ఫేర్ సొసైటీ వారు ముద్రించిన క్యాలెండర్ను మన ప్రియతమ నాయకుడు , అభివృద్ధి ప్రదాత అయిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు . అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టూవీలర్ కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు . మెకానిక్ కార్మికులను అసంఘటిత రంగ కార్మికులుగా గుర్తించి వారికి ప్రమాద బీమా అందేలా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు . కార్మికుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు . అలాగే టూవీలర్ మెకానిక్ యూనియన్ ను స్థాపించిన జిల్లా అధ్యక్షులు వంగాల కొండల్ రావు ను అభినందించారు . మెకానిక్లలో ఐక్యతను పెంపొందించి , టూవీలర్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టి , మెకానిక్ కుటుంబాల సమస్యలను పరిష్కరించటంతోపాటు , ఆర్థిక సహాయం చేయటం వంటి కార్యక్రమాలను నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం , టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , శివ రియల్ ఎస్టేట్ శివరామకృష్ణ మరియు నాయకులు శ్రీను , మురళి , రమేష్ , నాగేశ్వరరావు , రాజు , వెంకట్ , జగదీష్ తదితరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube