మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

2
TMedia (Telugu News) :

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

 

టీ మీడియా, నవంబర్ 19, బోనకల్ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడకులను సీఎల్పీ నాయకులు,మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్కఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బంధం నాగేశ్వరరావు అధ్వర్యంలో శనివారం మండల కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా నాయకులు ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులుఅర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని,భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా ఇందిరగాంధీ భారత దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని అన్నారు.

 

Also Read : ఎమ్మెల్సీ కవిత క్షమాపణ చెప్పాలి

 

ఈ దేశానికి 16 సంవత్సరాల పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ బడుగు,బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో మధిర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఊమ్మినేని రమేష్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు కందుల పాపారావు,ఆల్లపాడు గ్రామ ఎస్సిసెల్ అధ్యక్షుడు వేల్పుల రమేష్,పెద్దబీరవల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరామరావు,ఆళ్ళమోహనరావు, రెడ్డిబోయిన వీరబాబు,యువజన కాంగ్రెస్ నాయకులు హేమూన్,కొండా అవినాష్,వట్టికుండా కార్తీక్,బెడ బుడుగు జంగాల మండల అధ్యక్షుడు శ్రీపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube