ఉద్యానవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సత్తుపల్లి పోలీస్ స్టేషన్ నందు ఉద్యానవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు.
సత్తుపల్లి పోలీస్ స్టేషన్ నందు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పోలీస్ అధికారులు ఏసీపీ వెంకటేష్ గారిని, సీఐ రమాకాంత్ గారిని, యస్.ఐ నరేష్ గారిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అభినంధించారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని తెలియజేసారు.