మహా శివరాత్రికి దీపకాంతులతో వెలిగిపోనున్న ఉజ్జయిని..

మహా శివరాత్రికి దీపకాంతులతో వెలిగిపోనున్న ఉజ్జయిని..

0
TMedia (Telugu News) :

మహా శివరాత్రికి దీపకాంతులతో వెలిగిపోనున్న ఉజ్జయిని..

లహరి, ఫిబ్రవరి 16, మధ్యప్రదేశ్‌ : మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల సహా ప్రముఖ శివాలయాలు ముస్తాబవుతున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంతేకాదు.. ఈ క్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18వ తేదీన ‘శివజ్యోతి అర్పణం-2023’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉజ్జయిని నగరంలో దాదాపు 21 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గత ఏడాది మహాశివరాత్రి నాడు ఉజ్జయినిలో 11,71,078 మట్టి దీపాలు వెలిగించారు. ఇప్పుడు ఏకంగా 21 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. శివరాత్రి రోజున ఉజ్జయిని క్షేత్రం దీపాల వెలుగులతో ధగధగ మెరిసిపోనుంది. మెగా ఈవెంట్ కోసం సన్నాహాలను CM చౌహాన్ సమీక్షించారు. అంతేకాదు ఫిబ్రవరి 18న దీపావళి వలె ఉజ్జయినిలో మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నట్లు తెలిపారు.

Also Read : మహా శివరాత్రి వేళ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే..

21 లక్షల దీపాలు వెలిగించే ఈ అపూర్వమైన కార్యక్రమానికి ప్రభుత్వ భాగస్వామ్యం కానుందని చౌహాన్ అన్నారు. ఉజ్జయినిలో శివజ్యోతి అర్పణం కార్యక్రమంలో భాగంగా నగరంలోని దేవాలయాలు, వాణిజ్య స్థలాలు, గృహాలు, క్షిప్రా నదీ తీరంతోపాటు ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లో మట్టి దీపాలు వెలిగించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఉజ్జయినిలోని ప్రముఖ ప్రదేశాలు విద్యుత్ దీపాలతో పాటు, రంగు రంగుల ముగ్గులతో అందంగా అలంకరించనున్నామని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube