ఉక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్త‌పాతం

ఉక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్త‌పాతం

1
TMedia (Telugu News) :

ఉక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్త‌పాతం
-వంద‌లాది ప్ర‌జ‌లు మృతి -త‌ప్పుబ‌ట్టిన ప్ర‌పంచ దేశాలు
టీ మీడియా, ఫిబ్రవరి 24,హైద‌రాబాద్ : ఉక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్త‌పాతం సృష్టిస్తున్నది. స‌రిహ‌ద్దు దాటి ఉక్రెయిన్‌లోకి ప్ర‌వేశించిన ర‌ష్యా బ‌ల‌గాలు దాడులు చేస్తున్నాయి. ర‌ష్యా బాంబు దాడుల్లో వంద‌లాది ఉక్రెయిన్ ప్ర‌జ‌లు మృతి చెందారు. ర‌ష్యా యుద్ధంతో ఉక్రెయిన్ ప్ర‌జ‌లు విల‌విల‌లాడిపోతున్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం ప్ర‌క‌టించ‌డాన్ని ప‌లు ప్ర‌పంచ దేశాలు త‌ప్పుబ‌ట్టాయి. అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్, ఇట‌లీ, యూకేతో పాటు ప‌లు దేశాలు ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా నిలిచాయి. ర‌క్త‌పాతం సృష్టిస్తున్న ర‌ష్యాపై ఆయా దేశాల అధ్య‌క్షులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

ఇది కూడా చదవండి :మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం
ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా ఉంటాం : అమెరికా
ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధాన్ని ప్ర‌క‌టించ‌డాన్ని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్ ప్ర‌జల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ర‌ష్యా దాడి అన్యాయ‌మైన‌ది అని ఆగ్ర‌హం వెలిబుచ్చారు. ఉక్రెయిన్‌లో జ‌రిగే విధ్వంసానికి ర‌ష్యా మాత్ర‌మే బాధ్య‌త వ‌హించాల‌ని బైడెన్ హెచ్చ‌రించారు. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా ఆయా దేశాల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతామ‌ని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు. శుక్రవారం జీ-7 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు

  ఇది కూడా చదవండి   పేదోళ్ళ దేవుడు- ఎన్టీఆర్ ఎన్టీఆర్

పుతిన్ ర‌క్త‌పాతం సృష్టిస్తున్నాడు : యూకే
ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ స్ప‌ష్టం చేశారు. ర‌ష్యా అధ్య‌క్షుడు ఉక్రెయిన్‌లో ర‌క్త‌పాతం సృష్టించ‌డం స‌రికాద‌న్నారు. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా యూకేతో పాటు దాని మిత్ర‌దేశాలు ఉంటాయ‌న్నారు. ఉక్రెయిన్‌లో ర‌ష్యా బాంబు దాడులు త‌న‌ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేశాయ‌ని బోరిస్ జాన్స‌న్ పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌లో దాడుల‌పై ఆ దేశ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడాను అని తెలిపారు.
ర‌ష్యానే బాధ్య‌త వ‌హించాలి : యూరోపియ‌న్ యూనియ‌న్
ఉక్రెయిన్‌లో జరుగుతున్న విధ్వంసానికి ర‌ష్యానే బాధ్య‌త వ‌హించాల‌ని యూరోపియ‌న్ యూనియ‌న్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లియోన్ ప్ర‌క‌టించారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని తీవ్రంగా ఖండించారు. ర‌ష్యాకు త‌గిన బుద్ధి చెప్తామ‌న్నారు. అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకోవ‌డం స‌రికాద‌న్నారు. ఉక్రెయిన్‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.
ర‌ష్యా దాడి అన్యాయం : ఇట‌లీ
ఉక్రెయిన్‌పై ర‌ష్యా మిల‌ట‌రీ దాడి చేయం అన్యాయ‌మ‌ని ఇట‌లీ ప్ర‌ధాని మారియో ప్ర‌క‌టించారు. ర‌ష్యా బాంబుల దాడిని ఎవ‌రూ స‌మ‌ర్థించ‌రు అని స్ప‌ష్టం చేశారు. ఈ యుద్ధాన్ని ఇట‌లీ ప్ర‌భుత్వం తీవ్రంగా ఖండిస్తుంద‌ని చెప్పారు. నాటో కూట‌మికి స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపారు. ఉక్రెయిన్ ప్ర‌జ‌ల‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. ర‌ష్యాకు వ్య‌తిరేకంగా యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌న్నారు.
ఖండించిన నాటో
ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడిని నాటో సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ జెన్స్ స్టోల్టెన్ బ‌ర్గ్ తీవ్రంగా ఖండించారు. ర‌ష్యా దూకుడు చ‌ర్య‌ల‌పై చ‌ర్చించేందుకు నాటో కూట‌మి స‌మావేశ‌మ‌వుతుంద‌ని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube