అదృశ్యమైన ఉమాదేవి హత్య

ఆలయం వెనుక మృతదేహం

1
TMedia (Telugu News) :

అదృశ్యమైన ఉమాదేవి హత్య -ఆలయం వెనుక మృతదేహం
టి మీడియా, ఎప్రిల్22,మల్కాజ్‌గిరి‌ :లో గుడికని ఈ నెల 18న వెళ్లి అదృశ్యమైన ఉమాదేవి అనే మహిళ కథ విషాదాంతంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన పోలీసులు హత్య చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుని షాక్ అయ్యారు. గుడికి వెళ్లిన ఉమాదేవి నగలపై కన్నేసిన పూజారే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు (పూజారి) మురళిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మల్కాజిగిరి, విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌ కాలనీలో ఈనెల 18న అదృశ్యమైన ఉమాదేవి (57) మృతదేహం కాలనీలోని స్వయంభూ సిద్ది వినాయకస్వామి ఆలయం వెనుక కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Also Read : పిల్లల ముందే కత్తితో పొడిచి చంపిన వ్యక్తి

అదృశ్యమైన రోజునే ఉమాదేవిని హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఉమాదేవి భర్త జీవీఎన్‌.మూర్తి రైల్వేలో ఉద్యోగం చేస్తూ వలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె వివాహం గత నెల 27న జరిపించారు. ఉమాదేవి రోజూ ఇంటికి దగ్గర్లోని స్వయంభూ సిద్ది వినాయకస్వామి ఆలయానికి, విష్ణుపురిలోని శివాలయానికి వెళుతుంది. ఈనెల 18న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో మూర్తి భార్య ఆచూకీ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆలయం వెనుక మృతదేహం లభ్యమైంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube