అనుమతి లేని నిర్మాణం లు

- లాడ్జి గా మారిన ఇల్లు

0
TMedia (Telugu News) :

అనుమతి లేని నిర్మాణం లు

– లాడ్జి గా మారిన ఇల్లు

– నిబంధనలు కు విరుద్ధంగా 4 ఫ్లోర్ లు, ఆపై షాప్ లు

– రోడ్డు పైన టాయిలెట్ లు కట్టిన అపార్ట్మెంట్ బిల్డర్

– ఖమ్మం కార్పొరేషన్ లో అవినీతి కంపు

టి మీడియా ,అక్టోబర్ 12,ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ లో మరోసారి అవి నీతి కంపు వెదజల్లు తోంది.అడ్రస్ లేని మ్యాన్ పవర్ ఏ జన్సి ద్వారా కప్యూటర్ ఆపరేటర్ లు నీ నియమించి అక్రమ మార్గం లో వేతనాలు సైతం డ్రా చేసిన ఖమ్మం నగర మున్సిపల్ ప్రణాళిక విభాగం ఈ అక్రమాలు కు అడ్డా అనేది మరోసారి స్పష్టం అయింది. ఇందుకు నిదర్శనం గ నగరం లోని 22,23,24 డివిజన్ లో తాజా గా జరిగిన అక్రమ భారీ నిర్మాణాలు ఇందుకు నిదర్శనం గా ఉన్నయి.నగరం మొత్తం గా చూస్తే ఇటువంటివి వందల సంఖ్య లో ఉన్నయి.అనుమతులు ఓకటి నిర్మాణం మరొకటి చేసిన అధికారులు అటువైపు చూడక పోవడం వెనుక మర్మం ఏంటి అన్న చర్చ సాగుతోంది.వివరాలు పరిశీ లిస్థే..

22 వ డివి జన్ లో 4 అంతస్తు లో తో రెండు నిర్మాణాలు జరిగాయి. పూర్తి కావస్తున్న ఈ నిర్మాణ లు 160 గజాలు గా ఉన్న ప్లాట్ ను రెండు భాగాలు చేసి నిర్మాణం చేశారు.నిబంధనలు కు విరుద్ధం గా 160 గజాలు స్థలం కలిపి గ్రౌండ్ లో షాపింగ్ వేశారు .నిబంధనల ప్రకారం అటువంటి నిర్మాణాలు కు సెల్లార్ అవసరం . అది లేదు .నిత్యం మున్సిపల్ కమిషనర్ ఇంటికి వెళ్ళే బోన క ల్లు రోడ్డు అనుకొని ఈ నిర్మాణం జరుగుతోంది.అయిన అటువైపు చూసిన వారు లేరు.ఇదే వ్యక్తులు మున్సిపల్ రోడ్డు ఆక్రమించారు.

Also Read : శ్రీవారి వివిధ సేవ‌ల ఆన్ లైన్ టికెట్ల షెడ్యూల్ విడుదల

23 వ డివి జన్ ముస్తఫా నగర్ జంక్షన్ అనుకొని ఉన్న పాత భవనం రీ మోడలింగ్ చేశారు.మున్సిపల్ రికార్డుల్లో ఆ భవనం నివాస గృహం. నిబంధనలు కు విరుద్ధం గా ఇళ్ల మధ్య ఆ భవనం ను ఏకంగా లాడ్జి గా మార్చి రేసి డెన్సి అని బోర్డ్ పెట్టారు. ఈ భవనం ను వాణిజ్య అవసరాలు కు అది కూడా నివాసాలు మధ్య ఏర్పాటు చెయ్యడం గమనార్హం.కనీసం ఈ నిర్మాణం ఇంటి నెంబర్ చట్ట పరంగా బైట బోర్డ్ పై అందరి కు అగుపించే విధంగా ఉండాలి.అదీలేదు.జి ఎస్ టి,ట్రేడ్ లైసెన్స్ లు పైన అనుమానం.అయిన చర్యలు లేవు.స్థానిక శాంతినగర్ స్కూల్ ప్రక్క రోడ్ లో అపార్ట్ మెంట్ నిర్మాణం చేపట్టిన వారు ఏకంగా రోడ్డు పైన టాయి లేట్ లు నిర్మాణం చేశారు అయిన అటువైపు చూసినవారు లేరు.నిబంధనలు కు విరుద్ధంగా ఆ అపార్ట్ మెంట్ నిర్మాణం ఉంది.అనుమతులు కు విరుద్ధం గా కూడా జరిగినట్లు తెలుస్తోంది.ఇది కాక మున్సిపల్ ప్లాట్ ఫాం రోడ్డు కబ్జా చేశారు అయిన చర్యలు లేవు ఇటువంటి వి నగరం లో వందల సంఖ్యలో జరుగుతున్న అటువైపు కన్నెత్తి చూడక పోవడం వెనుక మతలబు ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube