అందుబాటులో కి రానిపాఠ్యపుస్తకాలు

అవస్థలు పడుతున్న విద్యార్థులు

2
TMedia (Telugu News) :

అందుబాటులో కి రానిపాఠ్యపుస్తకాలు
-అవస్థలు పడుతున్న విద్యార్థులు
టి మీడియా, జూన్ 14,ఖమ్మం:వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు సోమవారం పునః ప్రారంభం అయ్యాయి.పుస్తకాలు లేకుండానే విద్యార్థులు పాఠాలు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఖమ్మం నగరంతో పాటు జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఇప్పటి వరకు 20 శాతం పుస్తకాలూ సరఫరా కాలేదు. మొత్తం 1. 40 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా వీటిలో సగం కూడా జిల్లాకు చేరలేదు.ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆంగ్ల మాధ్యమంలోకి మారిన పిల్లలకు పుస్తకాలు అందుబాటులో లేకపోతే ఇబ్బందులు తప్పేలా లేవు.

Also Read : ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు

ఈసారి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టనున్న నేపథ్యంలో ఒకవైపు ఆంగ్ల పాఠాలు. మరోవైపు తెలుగు పాఠాలు ఉండేలా ముద్రిస్తున్నారు. కాగితం కొరత కారణంగా ముద్రణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెండేళ్లుగా కరోనా పరిస్థితులు, ఆర్థిక అవస్థలతో మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాయి.ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల వలసలు అధికంగా ఉంటే. పాఠ్య పుస్తకాల సర్దుబాటు చేయడం మరింత కష్టంగా మారనుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube