కేసీఆర్ ప్రకటన నిరుద్యోగులు నమ్మేపరిస్థితి లేదు

టీ మీడియా, మార్చి 9, హైదరాబాద్

0
TMedia (Telugu News) :

కేసీఆర్ ప్రకటన నిరుద్యోగులు నమ్మేపరిస్థితి లేదు

-ఆస్కార్ ను మించిన పురస్కార్ నీకే
-ఎంపీబండి సంజయ్*
టీ మీడియా, మార్చి 9, హైదరాబాద్:
బీజేవైఎం మిలియన్ మార్చ్ నేపధ్యంలోనే కేసీఆర్ ప్రకటన
బీజేవైఎం మిలియన్ మార్చ్ నేపధ్యంలోనే కేసీఆర్ ప్రకటన
కెసిఆర్ బంగాళాఖాతంలో బీజేపీని కలిపేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన ఆ పని నీ తరం కాదు, నీ అబ్బ తరం కాదు అంటూ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ని, టిఆర్ఎస్ పార్టీని మూసీ నదిలో కలిపేస్తామని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేవైఎం మిలియన్ మార్చ్ కు సిద్ధమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులు బుధవారం ఉదయం పదిగంటలకు టీవీ చూడాలంటూ ప్రకటన చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ప్రకటన చేసినా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదు
సీఎం కేసీఆర్ ప్రకటన చేసినా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదు

Also Read : పీ.ఏ.సి.ఎస్ చైర్మన్ మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేరు నమోదు చేసుకున్న 25 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తే కెసిఆర్ సర్కార్ ను విడిచిపెట్టేది లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ ల పై సీఎం కేసీఆర్ ప్రకటన చేసినా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ప్రపంచ గోల్ మాల్ సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్
ఒక్కో నిరుద్యోగి బ్యాంకు ఖాతాలో వెంటనే ఒక లక్షా ఇరవై వేల చొప్పున జమ చేయాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బిశ్వాల్ కమిటీ నివేదిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని బండి సంజయ్ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ప్రపంచ గోల్మాల్ సంఘం అధ్యక్షుడు కెసిఆర్ అంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

Also Read : వాహనదారులు కు అవగాహన

ఆస్కార్ ను మించిన పురస్కార్ నీకే
ఆస్కార్ ను మించిన పురస్కార్ నీకే
ప్రపంచ గోల్మాల్ గోవిందా లకు అధ్యక్షుడు కెసిఆర్ అని, ఆయనకు గోల్డ్ మెడల్ ఇవ్వాలని బండి సంజయ్ పేర్కొన్నారు. అబద్దాలు ఆడే వాళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సి వస్తే అంతకుమించిన పురస్కార్ నీకే ఇవ్వాలంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ మీద నిందలు వేయడానికి సీఎం కేసీఆర్ రెడీ గా ఉంటారని, మమ్మల్ని మతపిచ్చిగాళ్ళు అంటారా అంటూ మండిపడ్డారు. ఎస్ మేం హిందూ ధర్మం కోసం ప్రాణం ఇచ్చేంత మత పిచ్చి గాళ్ళమే అని బండి సంజయ్ పేర్కొన్నారు.

నోటిఫికేషన్ ఇచ్చి కేసులేయిస్తే సహించేది లేదు

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పి మీ వాళ్లతో కోర్టులో పిటిషన్లు వేయించి ప్రతిపక్షాల పైన నెపం నెడతావేమో అస్సలు ఊరుకోం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వివాదాలు రాకుండా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తొలగించిన విద్యావలంటీర్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను, 22 వేల స్కావెంజర్ లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube