గుర్తు తెలియని మృతదేహం లభ్యం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 14, మహానంది:

మహానంది మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ వ్యవసాయ క్షేత్రం వద్ద తెలుగు గంగ ఉప కాలువలో ఆడ మృతదేహం తేలియాడుతుండటంతో స్థానికులు గమనించి మహానంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి మహానంది ఎస్‌ఐ నాగార్జున రెడ్డి,మరియు పోలీస్ సిబ్బంది చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. చనిపోయి ఐదు లేదా ఏడు రోజులై ఉండవచ్చు అని భావిస్తున్నారు. సుమారు 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండవచ్చు అని ఎస్‌ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Undefined body found
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube