మ‌రచిపోలేని అనుభవం.. కేర‌ళ విహారం!

మ‌రచిపోలేని అనుభవం.. కేర‌ళ విహారం!

0
TMedia (Telugu News) :

మ‌రచిపోలేని అనుభవం.. కేర‌ళ విహారం!

లహరి, పిబ్రవరి 23,కల్చరల్ : జీవితంలో మ‌రచిపోలేని అనుభవం.. కేర‌ళ విహారం! కేరళ అనగానే.. అక్కడి ప్రకృతి, లోయలు, మనసును కట్టిపడేసే అందమైన ఇళ్లు, ప్రజల జీవన విధానం ముచ్చట గొలుపుతాయి. కనువిందు చేసే సెలయేర్లు, ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని చెట్లు, అరుదైన బోట్లు, అందనంత ఎత్తులో నివాసాలూ.. ఇలా చెప్పుకుంటూపోతే.. కేరళ వైవిధ్యం ఎంతో! అలాంటి అందాల కేరళ్ళ పర్యటన విశేషాలు మీకోసం! కేరళ మొత్తంలో చెప్పుకోదగ్గ ప్రాంతాలు ఇవీ అని ప్రత్యేకంగా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇడుక్కి జిల్లా పరిధిలో ఎక్కడ చూసినా సుగంధ ద్రవ్యాలు కనిపించాయి. ఎక్కడికక్కడ తోటల దగ్గరే షాపులు పెట్టి, వాటిని అమ్ముతున్నారు. వంద రూపాయలిస్తే తోటలోకి వెళ్లి ఇవన్నీ చూసి రావొచ్చు. అక్కడున్నంతసేపు అదో కొత్త ప్రపంచంలా కనిపించింది. పార్ఘాట్‌లోని మలప్పుజ డ్యామ్ కింద ఏర్పాటు చేసిన అతిపెద్ద పార్కు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాల్సిందే. రోప్‌వేతోపాటు నిరంతరం డ్యామ్ నుంచి వచ్చే నీటితో ప్రవహించే పిల్లకాలువ పార్కుకు ప్రత్యేక అందాన్ని తెచ్చిపెట్టడంతో పాటు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అప్పట్లో ఆ ప్రాంతం తమిళనాడు రాష్ట్రంలో ఉండగా ఈ డ్యామ్ నిర్మించారు. పార్కులో ఉన్న అందమైన పూలమొక్కలు, వాటర్ ఫౌంటెన్‌లు మనసుకు ప్రశాంతతను కలిగించడంతో పాటు వాటిని వర్ణించడానికి మాటలు చాలవంటే అతిశయోక్తి కాదు. వీధులన్నీ సందడిగా.. ఇక్కడ అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మున్నార్ ప్రాంతం. పాలక్కడ్‌లో బయలుదేరి, సుమారు ఆరుగంటల పాటు ప్రయాణించిన తర్వాత మున్నార్‌కు చేరుకున్నాం. మొత్తం ఘాట్ రోడ్‌లో ఈ ప్రయాణంలో మున్నార్ చేరగానే కనిపించే టీ ఎస్టేట్ మనుసును కట్టి పడేస్తుంది. ఆకాశంపైన ఉన్నామా? అనిపించేంత అనుభూతిని కలిగిస్తుంది ఈ ప్రయాణం. ఇక్కడ ఉదయం పూట బయటకు రావడం సరికొత్త అనుభూతి. ఆరుగంటల జర్నీలో రెండు గంటలు పూర్తిగా ఘాట్ రోడ్‌లోనే ప్రయాణం సాగింది. అత్యంత ఎత్తైన ఈ మార్గంలో ప్రయాణం ఒక మధురానుభూతి. మున్నార్ చేరిన తరువాత అక్కడ శరవణ భవన్‌లో భోజనానికి వెళ్లగానే కేరళ రైస్, వైట్ రైస్, బిర్యానీనా? అని ముందుగానే అడుగుతారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే ఎక్కువ. దీంతో మున్నార్ వీధులన్నీ సందడిగా ఉన్నాయి.

Also Read : ప్ర‌పంచ ఖ్యాతిగాంచిన‌ ఆధ్యాత్మిక కేంద్రం

న్యూ ఇయ‌ర్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పే తమిళనాడులోని ముఖ్య ప్రదేశాలు మ్యూజియం ప్రత్యేకత భోజనం ముగించుకుని, అక్కడున్న కన్నన్ దేవన్ హిల్ ప్లాంటేషన్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన టాటా టీ ఫ్యాక్టరీలోకి వెళ్లాం. తేయాకు నుంచి టీ ఎలా తయారవుతుందో అక్కడే చూశాం. ఇక్క‌డి కంపెనీలో కార్మికులూ భాగస్వాములుగా ఉండటం విశేషం. అప్పటికప్పుడు తయారైన టీపొడితో కాచిన టీ రుచి గురించి మాటల్లో చెప్పడం కంటే అక్కడకు వెళ్లినప్పుడు తాగి, ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. తర్వాత అక్కడ నుంచి నేరుగా టీ మ్యూజియం చూడటానికి బయలుదేరాం. సాయంత్రం ఐదున్నరకే దీన్ని మూసేస్తారు. అయితే అప్పటికే సమయం ఆరు గంటలు దాటింది. దీంతో కంపెనీ యాజమానితో ఫోన్ చేయించడంతో అనుమతించారు. 1884, 1905లో టీపొడి తయారుచేసిన మిషన్‌లు కనిపించాయి. వీటిన్నింటినీ చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. మ్యూజియం మొదట్లోనే 1913 నాటి సన్యల్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇవేకాకుండా అప్పటి ఈస్టిండియా కంపెనీ వాడిన రైలుచక్రం ఒకటి ఆ మ్యూజియంలో ఉంది. మరీ ముఖ్యంగా 1904లోనే వాడిన సినీ ప్రాజెక్టర్, రెండో శతాబ్దంలో మున్నార్‌లో వాడిన వస్తువులనూ ఇందులో ఉంచారు. ప్రతి ఒక్కరూ కచ్ఛితంగా చూడదగ్గ ప్రాంతం ఈ మున్నార్ టీ మ్యూజియం. ఈ మ్యూజియంలోనే మున్నార్ హిల్ ప్లాంటేషన్ ను కళ్లకు కట్టినట్టు చూపేందుకని చిన్నపాటి కొండపై మొత్తం మున్నార్ ఎస్టేట్‌ను పోలిన తోటను ఏర్పాటు చేశారు. క్రిస్మ‌స్ వేడుక‌ల‌కు ముస్తాబయిన‌ న‌గ‌రాలు చెట్లూ భాగస్వామ్యంగా…. దారి పొడవునా ఇళ్లుండటం కేరళ ప్రత్యేకత. మన ప్రాంతంలో ఉన్నట్లు ఏ ఊరికి ఆ ఊరు విడిపోయి ఎక్కడా కనిపించదు. కొంతమంది దట్టమైన అడవిలోనూ నివాసాలు ఏర్పాటు చేసుకుని, అక్కడే ఉంటున్నారు. ముఖ్యంగా ఇడుక్కి జిల్లాలో ఇళ్లు చాలా పెద్దవిగానూ, విశాలంగానూ ఉన్నాయి. కారు వెళ్లేందుకు మార్గం ఉండేలా ప్రతిఒక్కరూ దారి ఏర్పాటు చేసుకున్నారు. కేరళ జీవనవిధానంలో చెట్లు కూడా భాగస్వామ్యంగానే ఉండటం ఓ అద్భుతం. మేం ప్రయాణించిన దారిలో పాలక్కడ్ (పాల్జాట్), అలెప్పీ జిల్లాల్లో కొంతభాగం మినహా ఎక్కడా చదరపు భూములు కనిపించలేదు. కోజికోడ్, మలప్పురం, త్రిస్సూర్, ఎర్నాకులం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజ (అలెప్పీ), పతనంతిట్ట, కొల్లాం జిల్లాలో మొత్తం పెద్ద పెద్ద చెట్లే కనిపించాయి. ఎక్కువ ఇళ్లలో సోలార్ పవర్‌ను వినియోగించుకుంటున్నారు. ఇడుక్కి జిల్లాలో వీధిలైట్లకు ఎక్కువగా సోలార్ ప్యానెళ్లు బిగించి కనిపించాయి. ఎగ‌సిప‌డే అల‌లపై విహారానికి వ‌ర్కాల ఆహ్వానిస్తోంది బోటు విహారం ఓ ప్రత్యేకత అలెప్పీ సరస్సులో బోట్ల అందాన్ని వర్ణించడం సాధ్యం కాదు. నగరంలోనే బోటింగ్ జరగడం ఇక్కడి విశేషం. ప్రజారవాణాలో బోట్లు తప్పనిసరి కావడంతో అలెప్పీ మార్కెట్లో ఉన్న కాలువలోకి బోట్లు నేరుగా వస్తాయి. ప్రజలు వారికి కావాల్సిన సరుకులు కొనుగోలు చేసుకుని, నేరుగా బోటు ఎక్కుతున్నారు. ఈ నగరానికి ఇదో ప్రత్యేకత. మేం ఎక్కిన బోటులో ఎటాచ్డ్ బాత్రూములతో కలిపి ఆరు పడకగదులున్నాయి.

Also Read : వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మినరసింహ స్వామి దేవాలయం

పెద్దహాలు, వంటగది మొత్తం అందులోనే ఉన్నాయి. ప్రతి రూములోనూ టివి, ఎసి ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ బోట్లు తిప్పుతుంటారు. సాయంత్రం 5.30 గంటల తరువాత ప్రైవేటు బోట్లను అనుమతించరు. పూర్తిగా చేపల వేటకు కేటాయిస్తారు. ఇది అక్కడి ప్రభుత్వం నిర్ణయం. అప్పటికే బోటు విహారంలో భాగంగా సరస్సు మధ్యలో ఉన్న దీవికి చేరుకున్నాం. అక్కడ బాడీ మసాజ్, నీరా వంటివి అందుబాటులో ఉన్నాయి. అన్ని దీవుల్లోనూ ఈ తరహా ఏర్పాట్లు ఉన్నాయి. కొబ్బరితో తయారుచేసే కిల్లీ కూడా ఇక్కడ ప్రత్యేకం. వందలాది బోట్లు ఒకదానితో మరొకటి పోటీపడుతూ తిరుగుతూనే ఉన్నాయి. అందంగా అలంకరించిన పైకప్పులతో తిరుగుతున్న ఆ బోట్లను చూసి ఎంతో ముచ్చటేసింది. అన్ని ప్రధాన హోటళ్లకూ కాలువ ఉండటంతో నేరుగా చిన్నబోట్లోనే అక్కడకు చేరుకోవచ్చు. ప్రశాంత వాతావరణం మొత్తం ప్రయాణంలో కొల్లాం బీచ్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి ప్రజలు రాత్రి ఏడుగంటలకే ఇళ్లలోకి వెళ్లిపోతారు. ఎనిమిది తరువాత ఎవరూ రోడ్లపై కనిపించరు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు జీబ్రాక్రాస్ వద్ద రోడ్డు దాటేవాళ్లు చేయి ఎత్తితే, వాహనాలన్నీ ఆగిపోతాయి. రోడ్డు దాటిన తరువాత వెళతాయి. ప్రత్యేకంగా పోలీసులు ఉండి ట్రాఫిక్‌ను కంట్రోలు చేయాల్సినంత వాతావరణం కేరళలో కనిపించలేదు. ప్రధాన పట్టణాల్లో కూడళ్లలో ఉన్న వారంతా ప్రశాంతంగానే ఉన్నారు. కేరళలో 14 జిల్లాలుంటే 11 జిల్లాలో సాగిన మా పర్యటనలో ఎక్కడా చిన్నపాటి ఘర్షణ వాతావరణం కనిపించలేదు. విద్య వినయాన్ని పెంచుతుందనడానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube