యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 16 వనపర్తి : వనపర్తి జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను అప్పటి ప్రధానమంత్రి జోహార్ లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది. ఆతర్వాత పాలకులు అదేస్థాయిలో పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేయడం ద్వారా వనపర్తి జిల్లాలో ఉన్న అవకాశాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. కార్పొరేట్ కళాశాలతోపాటు ర్యాంకులు సాధించిన చరిత్ర వనపర్తి ఉంది. ప్రత్యేక రాష్ట్రంలో విద్యను ప్రోత్సహించడం విద్యావకాశాలు కల్పించకుండా విద్యార్థులు నిరుద్యోగులను అవమానకరంగా మాట్లాడుతున్న ప్రస్తుత పాలకులు ఏ మాత్రం తగ్గకుండా ఉద్యోగాలకు దూరం చేస్తున్న పరిస్థితి చూస్తే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విద్యార్థుల కొరకు వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల అభివృద్ధి వారికి ఉన్నత విద్య అవకాశాలు కల్పించాలని జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని నెరవేర్చాలని కోరుతున్నామన్నారు.

వనపర్తి జిల్లాలో నిరుద్యోగులు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతున్నా అవేమీ పట్టనట్టు ముఖ్యమంత్రి పర్యటనలో వనపర్తి జిల్లాలో యూనివర్సిటీ పై ప్రత్యేక ప్రకటన చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వనపర్తి జిల్లాలో కేవలం నాలుగు రకాల కోర్సులు మాత్రమే వనపర్తి పీజీ కళాశాలలో ఉండడం ఇప్పటికే సొంత భవనం నిర్మాణం పూర్తయి చాలా కాలం అయినప్పటికీ నేటికీ పీజీ సెంటర్ ను ప్రారంభించక పోవడం చూస్తే విద్యార్థులను విద్యావంతులను నిరాశ పరచడంగా భావిస్తున్నాను ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఆ యొక్క పీజీ కళాశాల ప్రారంభించి ఆ యొక్క పీజీ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పించాలి అని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది అన్నారు.

The Prime Minister Jawaharlal Nehru inaugurated the government Polytechnic College.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube