విమానాశ్రయంలో పట్టుబడిన అరకిలో బంగారం

విమానాశ్రయంలో పట్టుబడిన అరకిలో బంగారం

1
TMedia (Telugu News) :

విమానాశ్రయంలో పట్టుబడిన అరకిలో బంగారం
టీ మీడియా, ఏప్రిల్ 7,హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అతని లోదుస్తుల్లో 478 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో అధికారులు బంగారాన్ని సీజ్‌ చేశారు. దాని విలువ రూ.24.82 లక్షలు ఉంటుందని చెప్పారు.

Also Read : రాష్ట్రంలో కోకాకోలా సంస్థ రూ. 1,000 కోట్ల పెట్టుబడులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube