టీ మీడియా ఏప్రిల్ 7,పెద్ద శంకరంపేట..
ముస్లిం మైనార్టీ ల ఓట్ల కోసమే గ్రూప్ వన్ లో సీఎం కేసీఆర్ ఉర్దూ మీడియంలో పరీక్షలు నిర్వహించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని పెద్దశంకరం పేట మండల బిజెపి అధ్యక్షులు కోణం విఠల్ పేర్కొన్నారు… శనివారం పేట బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు… ఉర్దూ మీడియంలో పరీక్షలు నిర్వహించడం వల్ల కేవలం మైనార్టీ విద్యార్థులకు లాభం చేకూరుతుందని… ఈ విధానం వల్ల తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. లేడీ పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు… ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు ఉందన్నారు.. భారత రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టించారు నిజాం పాలన వల్లే నియంతృత్వ పోకడలకు సీఎం కేసీఆర్ పోతున్నారని ఆయన విమర్శించారు…. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు శ్రావణ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు