మతపరమైన భాషతో పరీక్షలు నిర్వహించడం మోసం

మతపరమైన భాషతో పరీక్షలు నిర్వహించడం మోసం

0
TMedia (Telugu News) :

 


టీ మీడియా ,మే 6 ,వనపర్తి బ్యూరో:గ్రూప్ వన్ పోస్టుల పరీక్ష విధానంలో టి ఎస్ పి ఎస్ సి నిర్ణయం సరైనది కాదు. *అంబేద్కర్ స్మారక కార్యాలయం లో హిందూ వాహిని పాలమూరు విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్ తో పాటు ఉర్దూలో పరీక్షలు నిర్వహించడం మత పరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే! గతంలో పరీక్షలు నిర్వహించిన సంప్రదాయానికి భిన్నంగా, నేడు గ్రూప్ వన్ ఉద్యోగాల పరీక్షల్లో ఉర్దూ తీసుకువచ్చారు. దీంతో ఉర్దూ చదివినవారికి మేలు కలిగి, మిగతా వారికి నష్టం వాటిల్లుతుంది. టి ఎస్ పి ఎస్ సి పునరాలోచించి మతపరమైన ఉర్దూ భాషను తీసేయాలి. దేశం మొత్తంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా రిజినల్ ( స్థానిక) భాష తో పాటు ఇంటర్నేషనల్ ( ఇంగ్లీషు) భాషలో పరీక్ష నిర్వహిస్తారు.

  also read :వంట గ్యాస్ మటాష్- 1 

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రం తీసుకున్న కూడా ఆ రాష్ట్రంలోని అధికారిక భాష తో పాటు అంతర్జాతీయ భాష వాడటం పద్ధతి. కానీ తెలంగాణ మాత్రం అలా కాకుండా రీజినల్ భాష తెలుగుతో పాటు రిలీజియన్ ( మతపరమైన) భాష లో పరీక్ష నిర్వహించడం ప్రమాదకరం అవకతవకలకు అవకాశం లేకుండా ఇంటర్వ్యూలు తొలగించడం సబబే. ఇది మంచి నిర్ణయమే..! కానీ రిలీజియన్ (మతపరమైన) భాషను తీసుకురావడం కారణంగా జనరల్ కేటగిరీలో కూడా ఉర్దూ చదువుకున్నవారు పరీక్షలు రాస్తారు. తద్వారా వాటి వేలువేషన్ కూడా ఉర్దూ వారే చేస్తారు. దీంతో వారి వర్గానికి అత్యధిక మార్కులు వేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ రీవాల్యుయేషన్ చేయాలన్నా.. అది కూడా తిరిగి ఉర్దూ చదివిన వారి వద్దకే వెళ్తుంది. కాబట్టి ఎటుచూసినా ఉర్దూ చదివినవారికి మేలు కలిగే అవకాశం ఉంది. దీంతో ఎంతో ప్రతిభ గలవారు ఉద్యోగాలకు దూరమై పోవడం కాయం. ఒక్కో మార్కు కూడా ఎంతో వ్యాలబుల్. అలాంటిది ఉర్దూలో అధిక మార్కులు వేసుకుంటే ప్రతిభ గల వారు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.

also read :మహిళ కడుపులో దూది వదిలి కుట్లు వేసిన డాక్టర్లు                                                                                      ఈ విషయాలను టి ఎస్ పి ఎస్ సి మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఎందుకంటే గ్రూప్ వన్ ఉద్యోగం అనేది ఐఏఎస్ లకు సరిసమానమైనది కాబట్టి. ముఖ్య విషయం ఏమంటే.. “ముస్లింలు తప్ప ఎవరు ఉర్దూ చదువుకోవడం లేదు” అనే *విషయం అందరూ గమనించాలి.కొంతమంది ఉర్దూ కు.. ముస్లిమ్స్ కు సంబంధం లేదు అని అంటారు. ఒకవేళ అదే నిజమైతే .. మరి సంస్కృత భాషలో కూడా పరీక్షలు నిర్వహిస్తారా..? ఉర్దూ మరియు సంస్కృత భాష అనేది కొన్ని వర్గాల వారు మాత్రమే నేర్చుకుంటారు. అది వారి మతాలకు సంబంధించిన అంశం కూడా. మెజార్టీ ప్రజలకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు.లేని యెడల రాష్ట్ర మొత్తం హిందూ వాహిని ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది *దీన్ని తొలగించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రోహిత్, ఉపాధ్యక్షుడు నరేష్ ప్రధాన కార్యదర్శి రాకేష్,చరన్ , సిద్దు , తదితర హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube