చైనా విమానాల‌పై అమెరికా స‌స్పెన్ష‌న్‌

చైనా విమానాల‌పై అమెరికా స‌స్పెన్ష‌న్‌

1
TMedia (Telugu News) :

చైనా విమానాల‌పై అమెరికా స‌స్పెన్ష‌న్‌

టీ మీడియా, ఆగస్టు 26, వాషింగ్ట‌న్‌: కోవిడ్ కేసుల నేప‌థ్యంలో అమెరికా విమానాల‌ను ఇటీవ‌ల చైనా ర‌ద్దు చేసింది. అయితే చైనా ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని ఖండిస్తూ అమెరికా కూడా చ‌ర్య‌లు చేప‌ట్టింది. చైనాకు చెందిన 26 విమానాల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది. చైనాలోని నాలుగు సంస్థ‌ల‌కు చెందిన విమానాలు ఆ జాబితాలో ఉన్నాయి. జియామిన్‌, ఎయిర్ చైనా, చైనా స‌ద‌ర‌న్ ఎయిర్‌లైన్స్‌, చైనా ఈస్ట్ర‌న్ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ల‌కు చెందిన విమానాల‌ను సెప్టెంబ‌ర్ 5 నుంచి 28 తేదీ వ‌ర‌కు ర‌ద్దు చేశారు.

 

Also Read : తాజ్‌మ‌హ‌ల్‌ను చూసేందుకు సైకిల్ అమ్మేశాడు

 

లాస్ ఏంజిల్స్ నుంచి వెళ్లే 19 విమానాల‌ను, న్యూయార్క్ నుంచి ఏడు విమానాల‌ను ర‌ద్దు చేయ‌నున్నారు. అకార‌ణంగా అమెరికా త‌మ విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు చైనా ఎంబ‌సీ ప్ర‌తినిధి లియూ పెంగ్యూ తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లిన నాటి నుంచి అమెరికా, చైనా విమాన స‌ర్వీసుల‌పై గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది. జ‌న‌వ‌రిలోనూ చైనాకు చెందిన 44 విమానాల‌ను అమెరికా ర‌ద్దు చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube