యుటిఎఫ్ జిల్లా మహాసభను జయప్రదం చేయండి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్26,కరకగూడెం:

కరకగూడెం మండల యుటిఎఫ్ అధ్యక్షులు కే నరేందర్ అధ్యక్షతన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్)సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా యుటిఎఫ్ అధ్యక్షులు,కార్యదర్శి నరేందర్,రాము మాట్లాడుతూ…ప్రభుత్వ విద్యాసంస్థలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్య వాలంటీర్స్ గా నియమించాలని ఆయన అన్నారు.
అదే విధంగా విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించాలని తెలిపారు.పాఠశాల ప్రాంగ‌ణంలో పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం ఈనెల 28న భద్రాచలం బిఎస్ఆర్ గార్డెన్ నందు జరిగే యుటిఎఫ్ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రాము,సరోజిని,రాజా,లక్ష్మణ్,కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Karakagoodem Mandal UTF President K Narender chaired the United Teachers Federation (UTF) meeting.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube