ఈనెల 28న జిల్లా స్థాయి యుటిఎఫ్ సమావేశం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్,26, భద్రాచలం

ఈ నెల 28న జరిగే జిల్లాస్థాయి టీఎస్ యుటిఎఫ్ సమావేశం విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి థావురియా పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలం పట్టణంలోని నన్నపనేని మోహన్ స్కూల్ లో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి పాల్గొని మాట్లాడారు. ఈనెల 28న జరిగే విస్తృత స్థాయి సమావేశంలో విద్యకు సంబంధించిన విషయాలపై సమగ్ర చర్చ ఉంటుందని అధిక సంఖ్యలో మండలంలోని ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.

అదేవిధంగా విద్యా సంస్థకు సంబంధించిన కొన్ని తీర్మానాలను విస్తృతస్థాయి సమావేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుందని పాఠశాల స్థాయిలో ఏవైనా అవకతవకలు ఉంటే ప్రభుత్వం వెంటనే స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా ఏజెన్సీలో పనిచేసే ఉపాధ్యాయులు ఏజెన్సీ అలవెన్సులు వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రతి పాఠశాలలో స్కావెంజర్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు బదిలీలు, ప్రమోషన్లు జరపాలని కోరారు.

సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పై విషయాలన్నీ విస్తృతంగా చర్చించి తీర్మానాలను విస్తృతస్థాయి సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు మండల ఆడిటర్ జై శ్రీను,ఎస్ విజయ్ కుమార్, ఎం రమేష్,సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube