తదుపరి సీజేఐ గా జస్టిస్ యు.యు.లలిత్

ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం

1
TMedia (Telugu News) :

తదుపరి సీజేఐ గా జస్టిస్ యు.యు.లలిత్

-ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం
టి మీడియా,ఆగస్టు4,ఢిల్లీ:  భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవరనే విషయంపై స్పష్టత వచ్చేసింది. ప్రస్తు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రవణ పదవీ విరమణ అనంతరం.. జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖ రాశారు. కాగా ఈ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరిశీలనకు పంపనుంది. ఆయన ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి వద్దకు చేరుకుని.. రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్న

 

Also Read : ఆడపిల్లలు పుట్టారని అరాచకం

 

కాగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ దేశంలోనే పలు సంచలనాత్మక కేసులకు తీర్పులు వెలువరించారు. త్రిపుల్‌ తలాక్‌ సహా, అనేక కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 1957 లో జన్మించిన ఆయన.. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, 1986 నుంచి తన ప్రాక్టీసునుసుప్రీంకోర్టుకుమార్చారు.అనంతరం2014ఆగస్టు13నసుప్రీంకోర్టున్యాయమూర్తిగానియమితులయ్యారు.అయితే.. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌వి. రమణ ఈ నెల (ఆగస్టు) 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube