డాక్టర్ పల్లవి ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్ 26, వెంకటాపురం(ములుగు) :

ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని తిప్పాపురం గ్రామపంచాయతీలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను మంగళవారం నిర్వహించారు. ఆలుబాక పశువైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా పల్లవి ఆధ్వర్యంలో టీకా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా పల్లవి మాట్లాడుతూ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించాలని గ్రామస్తులకు తెలిపి సలహాలు, సూచనలు ఇచ్చి టీకా కార్యక్రమంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాడిశ సత్యం, వెటర్నరీ అసిస్టెంట్స్ పండా.నాగరాజు, సోనియా గ్రామస్థులు పాల్గొన్నారు.

Vaccine for smallpox prevention under the auspices of Dr.pallavi .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube