39 మందికి ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేసిన వ్య‌క్తి అరెస్టు

39 మందికి ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేసిన వ్య‌క్తి అరెస్టు

1
TMedia (Telugu News) :

39 మందికి ఒకే సిరంజీతో వ్యాక్సిన్ వేసిన వ్య‌క్తి అరెస్టు

టి మీడియా,జూలై29,భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఒకే సిరంజీతో 39 మంది విద్యార్థులకు కొవిడ్‌ టీకాలు వేసిన జితేంద్ర అహిర్‌వార్‌ను అరెస్టు చేశారు. జితేంద్ర ఓ ప్రైవేటు న‌ర్సింగ్ కాలేజీలో విద్యార్థి. వ్యాక్సినేష‌న్ కోసం హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన శిక్ష‌ణ‌లో పాల్గొన్నాడు. సాగర్‌ నగరంలో జైన్‌ పబ్లిక్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో బుధవారం మెగా వ్యాక్సినేషన్‌ క్యాంపును ఏర్పాటుచేశారు.

 

Also Read : పి ఆర్ పనుల్లో వేగం పెరగాలి

 

శిబిరంలో టీకాలు వేసేందుకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్‌ వచ్చాడు. వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు వచ్చిన 15ఏండ్ల పైబడిన 39 మందికి ఒకే సిరంజీతో టీకాలు వేశాడు. వీరంతా 9 నుంచి 12 తరగతులకు చెందినవారే. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అధికారులు తనకు ఒకటే సిరంజీ పంపించారని, తన తప్పేమీ లేదని చెప్పడం గమనార్హం. దేశవ్యాప్తంగా వైరల్‌గా మారిన ఈ ఘటనపై.. ఇన్‌చార్జి కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube