కృష్ణంరాజు మృతి బాధాకరం వద్దిరాజు రవిచంద్ర

కృష్ణంరాజు మృతి బాధాకరం :వద్దిరాజు రవిచంద్ర

1
TMedia (Telugu News) :

కృష్ణంరాజు మృతి బాధాకరం :వద్దిరాజు రవిచంద్ర
టీ మీడియా,సెప్టెంబర్ 11, ఖమ్మం:
ప్రముఖ సినీహీరో, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మృతి తీవ్ర బాధాకరం అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కృష్ణంరాజు అనేక సినిమాలలో హీరోగా తన విలక్షణమైన నటనాశైలితో ‘రెబల్ స్టార్’ గా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారని, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారని రవిచంద్ర తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Also Read : వాగులో కొట్టుకుపోయిన కారు

సినిమా హీరోగా,లోక్ సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తెలుగు చిత్ర పరిశ్రమకు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణంరాజు విశేష సేవలందించారని కొనియాడారు.ఆయన మృతి సినిమా పరిశ్రమకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని వద్దిరాజు చెప్పారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు రవిచంద్ర తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube