స్మశానానికి స్థలం మంజూరు చేయాలి

స్మశానానికి స్థలం మంజూరు చేయాలి

1
TMedia (Telugu News) :

స్మశానానికి స్థలం మంజూరు చేయాలి

టీ మీడియా, మార్చి11, వనపర్తి : పట్టణంలో దళితులకు కాసింనగర్ రోడ్డు వైపు స్మశాన వాటిక కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి వనపర్తి మండల కార్యాలయంలో ఎమ్మార్వో రాజేందర్ గౌడ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో ఉన్న తాళ్ళచెరువు పునరుద్ధరిస్తూ ఉన్న క్రమంలో ఆ చెరువు కట్ట అంచనా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు వారి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఆ చెరువు కట్టను సమాధులు పూడ్చడానికి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే శవాలను పూడ్చి పెట్టారు చెరువు పునరుద్ధరిస్తూ ఉన్న క్రమంలో వారి యొక్క సమాధులు నేలమట్టమయ్యాయి.

Also read : మహిళా సభ్యులకు సన్మానం

ప్రస్తుతం ఎవరైన చనిపోతే పూడ్చడానికి ఆ ప్రాంత వాసులకు స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కాశింనగర్ రోడ్డు వైపు ఒక స్మశాన వాటిక నిర్మించి ప్రత్యామ్నాయం చూపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఇటీవల వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా స్మశాన వాటిక కోసం నిధులు మంజూరు చేస్తున్న మున్సిపల్ శాఖ వారు జీవో ఎంఎస్ నెంబర్ 65 ఆధారంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా కాశింనగర్ రోడ్ వైపు నూతన స్మశాన వాటిక నిర్మించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. గాంధీనగర్, ఎస్సీ కాలనీ, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల వారి అవసరాలకు అనుగుణంగా కరీంనగర్ రోడ్డు వైపు ఒక స్మశాన వాటిక నిర్మించవలసిందిగా కోరారు.

Also Read : బాలయ్య మరణంతీరని లోటు

ఐదు ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధుల ద్వారా స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ వారు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడం వల్ల నిర్మాణం చేపట్టడం లేదని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టిలో ఉంచుకొని స్థలాన్ని కేటాయించి మున్సిపల్ శాఖ వారికి అప్పగించ వలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి గాంధీనగర్ బూత్లెవల్ అధ్యక్షులు భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube