వాల్మీకులు రాజకీయంగా ఎదగాలి
– మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 2, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ వద్ద వాల్మికి బోయలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి , మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి , వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకులు రాజకీయంగా ఎదగాలి.
వాల్మీకుల అంశాన్ని మొట్టమొదటగా 2007 అక్టోబర్07 వ తేదీన వనపర్తి లో నిర్వహించిన సమావేశంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ దృష్టికి తీసుకుని వచ్చాము.
ఆంధ్ర లో ఎస్టీలుగా ఉంది తెలంగాణ లో బిసిలుగా ఎలా ఉంటారు మనం వీరిని కూడా తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత చేయాలని చెప్పడం జరిగింది. అప్పుడు సుమారు 4 లక్షలు ఉన్నారు వీరిని ఎస్టీ జాబితాలోకి చేర్చాలని అనుకున్నారు .రాజకీయ పరంగా కులంను తీసివేయలన్నా , కలపాలన్న కేంద్రం చేతిలో ఉంటుంది.
Also Read : మరో కొత్త కమిటీకి సిద్ధమవుతున్న ఏపీ సర్కార్
అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేశారు. అధ్యయనం చేయడానికి ఇంకా సమయం కావాలి అని చెబితే మళ్ళీ సమయం పెంచారు. అధ్యయనం నివేదికను తీసుకుని 1 శాతం కన్నా తక్కువగా ఉన్నారు 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి 10 శాతం కు పెంచి వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని రాష్ట్రం ప్రభుత్వం చట్ట సభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రంలో చలనం లేదు. డిల్లీ కి కూడా వాల్మికి బోయలను పంపడం జరిగింది.
ఢిల్లీ కి వెళ్లి తెలంగాణ ను ఎట్లా సాధించుకున్నామో అట్లాగే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కొట్లాడుదాం.
50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా వాల్మీకుల గురించి పట్టించుకున్న దాఖలాలున్నాయా. వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి కలపాలని మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రతిపక్షాలు మాట్లాడితే మీరు గట్టిగా సమాధానం చెప్పాలి.
రేపటి తరానికి మంచి విద్యను అందించాలి , మనం చేసే పనిని పిల్లలకు నేర్పించాలి అప్పుడే పని మీద ధ్యాస పెరుగుతుంది పెద్దలపై గౌరవం పెరుగుతుంది.
తెలంగాణ వచ్చిన తరువాత భూమి ఉన్నవాళ్లు కరెంట్, నీళ్లు, పెట్టుబడులు వస్తున్నాయి మంచిగా బతుకుతున్నారు.
Also Read : సిఐపై కానిస్టేబుల్ కత్తితో దాడి
గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. వలసలు తగ్గాయి పట్టణాల నుండి గ్రామాలకు తిరిగి వస్తున్నారు . లోకంలో ఏడా చేయలేనోడు మస్తు చెపుతారు అయ్యేది లేదు పోయేది లేదు .ఆర్థికంగా ఎట్లా ఎదుగుతామో అట్లాగే పింఛన్లు పెంచుతూ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.చెప్పిన పని చేస్తాడని ప్రజలందరు నమ్ముతారు. రైతు బంధు మినహా మిగిలిన 40 నుండి 50 లక్షల కుటుంబాలకు బీమా ఇచ్చే విధంగా ప్రభుత్వం చెప్పింది , ఆసరా పింఛన్ వారు కాకుండా మిగిలిన మహిళలకు సౌభాగ్యలక్ష్మీ ఇవ్వబోతున్నాం.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , రాష్ట్ర మార్కుఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, రీజనల్ అథారిటీ సభ్యులు ఆవుల రమేష్ , కౌన్సిలర్లు అలైఖ్య తిరుమల్, వాల్మీకి నాయకులు హరి శంకర్ నాయుడు, వేణుగోపాల్, రవి, సునీల్, మధులత తదితరులు పాల్గొన్నారు.మాజీ ఎంపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వాల్మికి బోయలను ఎస్టీ జాబితాలో కలపాలన్నదే వారి న్యాయమైన డిమాండ్. వాల్మీకి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కు దృష్టికి తీసుకెళ్లే విధంగా మంత్రి నిరంజన్ రెడ్డి ముందుటారు.తిండి గింజలు సమస్యలను ఇతర దేశాలు కరోనా సమయంలో అందరం తెలంగాణ లో మాత్రం సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం వల్ల కరోనా సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడలేదు.
ఈ ప్రభుత్వం మరోసారి రాబోతుంది గత మెజార్టీకి మించి ఎక్కువగా వస్తుంది.
Also Read : కాంగ్రెస్ పై నితీశ్ కుమార్ తీవ్ర విమర్శలు
వాల్మీకి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏపార్టు అయిన తరువాత వాల్మీకి బోయాల స్థితిగతుల పైన అధ్యయనం చేసింది ఆ తరువాత రెండుసార్లు వాల్మికి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కేంద్రానికి నివేదికలను పంపితే కలుపకుండా అన్యాయం చేసారు. వనపర్తి లో ఆర్టీవో కార్యాలయం పక్కన 20 గుంటల స్థలం ను ఇవ్వడం జరిగింది, వివేకానంద చౌరస్తాలో వాల్మికి విగ్రహం ను ఏపార్టుకు కృషి చేసారు .
వాల్మికి ఎమ్మెల్యే లేకపోయినా మా వాల్మికి అభ్యున్నతికి కృషి చేస్తున్న మీరు మా వాల్మికి బిడ్డలా భావించి ఎస్టీ జాబితాను కృషి చేయాలి అన్నారు.